Road Accident: మేడ్చల్ మల్కాజిగరి జిల్లా ఘట్ కేసర్ పోలీసు స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారుజామున మాధారం.. ఎదులాబాద్ మార్గంలో కారు అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ఐటీ ఉద్యోగులు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. వీరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులను హయత్ నగర్ మండలం కుంట్లూరుకు చెందిన భార్గవ్, సైనిక్ పురికి చెందిన వర్షిత్ గా గుర్తించారు.