
భారత భూభాగాలను తప్పుగా చూపుతూ సామాజిక మాధ్యమ సంస్థ ట్విటర్ మరోసారి ధిక్కార చర్యకు పూనుకుంది. కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్మూకశ్మీర్, లద్దాఖ్ ను వేరే దేశంగా చూపుతూ భారత దేశ పటాన్ని వక్రీకరించింది. ఇప్పటికే నూతన ఐటీ నిబంధనల విషయంలో కేంద్రం, ట్విటర్ మధ్య వివాదం నడుస్తోంది. తాజాగా చర్యతో ఈ సంస్థ ప్రభుత్వం నుంచి కఠిన చర్యలు ఎదుర్కోనుందని అధికార వర్గాలు అంటున్నాయి.