సినిమా స్టార్స్ కి అదనపు ఆదాయం అంటే ముందుగా చెప్పుకునేది అడ్వర్ టైజ్ మెంట్ల గురించే. సెలబ్రిటీ హోదా రాగానే అడ్వర్ టైజ్ మెంట్ ద్వారా మంచి ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు అని ఇప్పటి భామలు కూడా సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం తెగ ఉత్సాహ పడుతున్నారు. అయితే, డబ్బు అనేది నటీనటులకే కాదు,
అప్పుడప్పుడు యాడ్ ఫిల్మ్స్ చేసే సినిమా డైరెక్టర్స్ కి కూడా భారీ రెమ్యునరేషన్ ఉంటుంది. టాప్ హీరోలు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉంటే.. వాళ్ళు తాము నటించే యాడ్స్ కి తమకు ఇష్టమైన డైరెక్టర్ ను పెట్టుకోవచ్చు. అందుకే కంపెనీలకు ప్రకటనలు చేయాల్సి వచ్చిన ప్రతిసారి వాటిని డైరక్ట్ చేసే అవకాశం మాత్రం హీరోలు తమకు ఇష్టమైన డైరక్టర్లకు మాత్రమే ఇస్తారు.
ఆ విధంగా స్టార్ డైరెక్టర్లను తమకు దగ్గర చేసుకుంటారు మన స్టార్ హీరోలు. ఆ మధ్య త్రివిక్రమ్-ఎన్టీఆర్, త్రివిక్రమ్-మహేష్ కలిసి ప్రకటనలు చేసారంటే రీజన్ అదే. నిజానికి యాడ్ ఫిల్మ్ ద్వారానే ఎన్టీఆర్ – త్రివిక్రమ్ మధ్య బాండింగ్ బిల్డ్ అయింది. అలాగే మహేష్ తో త్రివిక్రమ్ ప్రస్తుతం సినిమా చేస్తున్నాడు అంటే దానికి పునాది కూడా యాడ్ ఫిల్మ్ నే.
అయితే తాజాగా త్రివిక్రమ్, ప్రభాస్ తో కూడా ఒక యాడ్ ఫిల్మ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన వీరిద్దరి కాంబినేషన్ లో భవిష్యత్తులో ఓకే సినిమా ఉండే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఈ యాడ్ ఫిల్మ్స్ ను డైరెక్ట్ చేయడం ద్వారా త్రివిక్రమ్ సంపాదన ఏడాదికి కోట్లల్లో ఉంటుంది. పైగా పెద్దగా వర్క్ కూడా ఉండదు. అందుకే త్రివిక్రమ్ కూడా యాడ్స్ అంటే వెంటనే డేట్స్ ఇచ్చేస్తున్నాడట.