Homeజాతీయ వార్తలుTVK Vijay Election Controversy : 100 కోట్ల తేడా.. ఎన్నికల వేళ టీవీకే విజయ్...

TVK Vijay Election Controversy : 100 కోట్ల తేడా.. ఎన్నికల వేళ టీవీకే విజయ్ కొంపమునిగింది..

TVK Vijay Election Controversy : క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం లేదు. బలమైన సోషల్ మీడియా విభాగం లేదు. మీడియా మేనేజ్మెంట్ తెలియడం లేదు. ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. చివరికి పార్టీలోని నాయకులే అధినాయకుడి మీద విమర్శలు చేస్తున్నారు. ఫలితంగా ప్రజల్లో నమ్మకం పోతోంది. అధికారం కాదు కదా.. కనీసం గౌరవప్రదమైన సీట్లు గెలుచుకుంటే చాలు అనే స్థాయికి పార్టీ పరిస్థితి జరిగింది.

తమిళనాడులో త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ అధికారం కోసం డీఎంకే, అన్నా డీఎంకే తీవ్రంగా పోటీ పడుతున్నాయి. మధ్యలో టీవీకే పార్టీ కూడా వచ్చి చేరింది. దీనివల్ల తమిళనాడు రాజకీయాల్లో ఏం జరుగుతుందనేది అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. విజయ్ పార్టీ పెట్టిన తొలి రోజుల్లో పరిస్థితి బాగానే ఉండేది. కానీ ఎప్పుడైతే ఆయన భార్య విజయ్ మీద విమర్శ చేయడం మొదలుపెట్టిందో అప్పుడే వ్యవహారం తేడాగా మారింది. అంతకుముందు ఓ సభలో కార్యకర్తలు చనిపోయారు. ఆ తర్వాత ఆయన నటించిన జన నాయకుడు అనే సినిమా విడుదలకు నోచుకోవడం లేదు. ఏకంగా సుప్రీంకోర్టు దాకా వెళ్ళినప్పటికీ అనుకూలంగా తీర్పు రావడం లేదు. ఇన్ని అవరోధాల మధ్య విజయ్ వ్యవహరిస్తున్న తీరు విచిత్రంగా ఉంది.

ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో టీవీ కే విజయ్ కి మద్రాస్ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఆయన ప్రకటించిన అఫిడవిట్ లో అవకతవకలు ఉన్నాయని ఆయనకు వ్యతిరేకంగా పిటిషన్ దాకలైంది. దీనిపై వివరణ ఇవ్వాలని హైకోర్టు నోటులు జారీ చేసింది. ఇదే క్రమంలో ఎలక్షన్ కమిషన్, ఆదాయపు పన్ను శాఖలకు కూడా నోటీసులు జారీ చేసింది. విజయ్ ఎన్నికల వివరాలు పరస్పరమైన విరుద్ధ విషయాలు ఉన్నాయి. తిరుచి తూర్పు నియోజకవర్గం లో పోటీ చేస్తున్న క్రమంలో విజయ్ తన చరాస్తులను 224 కోట్లుగా చూపించాడు. పెరంబుర్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న విజయ్ తన చరాస్తులను 105 కోట్లుగా చూపించాడు. ఆస్తుల వెల్లాడిలో 100 కోట్లు తేడా ఉండడాన్ని విగ్నేష్ అనే వ్యక్తి ప్రధానంగా ప్రస్తావించాడు. అతడు ఏకంగా హైకోర్టు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాడు.

ఎన్నికల అఫిడవిట్ లను మొత్తం కోర్టు దృష్టికి విగ్నేష్ తీసుకెళ్లాడు. దీంతో అతడు సమర్పించిన వివరాలను మద్రాస్ హైకోర్టు క్షుణ్ణంగా పరిశీలించింది. అఫిడవిట్ లో ఇన్ని విరుద్ధ అంశాలు ఎలా ఉంటాయని విజయ్ ని ప్రశ్నించింది. మరి దీనిపై విజయ్ ఎలాంటి సమాధానం చెప్తారో చూడాల్సి ఉంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version