Homeటాప్ స్టోరీస్Revanth Reddy : శభాష్ రేవంత్ రెడ్డి.. ఈ విషయంలో గబ్బర్ సింగ్ అని పిలవచ్చు..

Revanth Reddy : శభాష్ రేవంత్ రెడ్డి.. ఈ విషయంలో గబ్బర్ సింగ్ అని పిలవచ్చు..

Revanth Reddy : అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు కిరణ్ కుమార్ రెడ్డి అనే ఒక ముఖ్యమంత్రి ఉండేవారు. అప్పట్లో తెలంగాణ ఉద్యమం జోరుగా సాగుతూ ఉండేది. కిరణ్ కుమార్ రెడ్డి యాదృచ్ఛికంగా ముఖ్యమంత్రి అయ్యారు. తన మార్క్ పరిపాలన సాగించడానికి ఆయన అనేక విధాలుగా ప్రయత్నాలు చేశారు. కొన్ని రకాల పథకాలు ప్రవేశపెట్టి తెలంగాణ ప్రజల మనసులో చోటు సంపాదించుకున్నారు.. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాత బస్తీలో ఓ రాజకీయ నాయకుడిని అరెస్ట్ చేయించారు. అప్పట్లో అదొక సంచలనం. వాస్తవానికి ఆ రాజకీయ నాయకుడు జోలికి పేరుమోసిన ముఖ్యమంత్రులు కూడా వెళ్లలేదు. కానీ, కిరణ్ కుమార్ రెడ్డి ఆ పని చేసి చూపించారు.

ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అటువంటి డేరింగ్ స్టెప్ తీసుకున్నారు. పెద్ద పెద్ద ముఖ్యమంత్రులు చేయలేని పనిని ఆయన చేసి చూపించారు.. హైదరాబాద్ నగరంలో ఫుట్ పాత్ లు మామూలు దిగువ స్థాయి వ్యాపారులు మాత్రమే కాదు.. బడా కార్పొరేటర్లు కూడా ఆక్రమిస్తుంటారు. వాటిపై దర్జాగా దుకాణాలు ఏర్పాటు చేసి వ్యాపారాలు సాగిస్తుంటారు.. ఫలితంగా వాహనాల రాకపోకలు నిలిచిపోతాయి. దీంతో ట్రాఫిక్ జాం ఏర్పడుతుంది. తోపుడుబండ్లవారు.. చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారు ఫుట్ పాత్ ల మీద ఏకంగా షాపులు కట్టేసుకున్నారు. కొన్ని వీధుల్లో అయితే కనీసం వాళ్లు కూడా పట్టవు. ఎక్కడ ఒకచోట వాటిని పార్కింగ్ చేసి.. రెండు కాళ్లకు పని చెప్పి నడుచుకుంటూ వెళ్లాలి. గత ప్రభుత్వాలు ఎన్నడు కూడా ఈ వ్యక్తుల జోలికి రాలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి వీరు వైపు చూడలేదు. ఆక్రమణలకు అడ్డుకట్ట వేయలేదు సరి కదా.. ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల మరింత ఎంటర్టైన్ చేశారు. దీంతో అనేక ప్రాంతాలలో రోడ్లు మొత్తం ఇరుకుగా మారిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే రోడ్లు కూడా ఆక్రమణకు గురయ్యాయి.

ఈ విషయం ఎలా తెలిసిందో తెలియదు.. దానికి రేవంత్ ప్రభుత్వం దృష్టి సారించింది. హైడ్రా అనే వ్యవస్థ వల్ల కొంత మోదం.. కొంత ఖేదాన్ని ఎదుర్కొంటున్న రేవంత్ ప్రభుత్వం.. ఆక్రమణల తొలగింపు విషయంలో తగ్గేది లేదు అన్నట్టుగా వ్యవహరించింది. ముఖ్యంగా ఆర్టీసీ క్రాస్ రోడ్ లో దశాబ్దాలుగా ఫుట్ పాత్ ను ఆక్రమించి బావర్చి హోటల్ వ్యాపారం చేస్తోంది. దానిమీద షవర్మ దుకాణం పెట్టి దండిగా సంపాదిస్తోంది. దీంతో ఆ ఏరియాలో ఇరుకుగా మారిపోయింది. వాహనాలు కూడా వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చిక్కడపల్లి అధికారులు బావర్చి యాజమాన్యం అక్రమాలపై ఉక్కు పాదం మోపారు. చిరు వ్యాపారులు నిర్మించుకున్న అక్రమ భవనాలను నేలమట్టం చేశారు. మొత్తానికి ఇరుకుగా మారిపోయిన ఆ రోడ్డును వెడల్పు చేశారు.

ఇప్పటివరకు ఈ ప్రాంతంలో ఈ రోడ్డును వెడల్పు చేయాలని అంశాన్ని ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా ఆక్రమణలు తొలగించే ప్రయత్నం చేసింది. ఫలితంగా ఈ ప్రాంతం మీదగా రాకపోకలు సాగించే వారికి స్వేచ్ఛను కల్పించింది. వారి ఇబ్బందిని దూరం చేసింది. ప్రజల కష్టాలను తీర్చే వారిని.. ఇబ్బందులను దూరం చేసే వారిని గబ్బర్ సింగ్ అంటుంటారు. ఇక్కడ రేవంత్ కూడా గబ్బర్ సింగ్ లాంటివాడే కదా.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version