Homeఆంధ్రప్రదేశ్‌Tuni Gnaneswari : తుని జ్ఞానేశ్వరి మిస్సింగ్.. పోలీసుల సంచలన ప్రకటన

Tuni Gnaneswari : తుని జ్ఞానేశ్వరి మిస్సింగ్.. పోలీసుల సంచలన ప్రకటన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తుని ప్రాంతంలో జ్ఞానేశ్వరి అనే బాలిక మిస్సింగ్ అయింది. ఈ సంఘటన జరిగి దాదాపు 15 రోజులు దాటింది.. అయినప్పటికీ ఇంతవరకు ఈ కేసులో పురోగతి లేదు. ఇంతవరకు ఆ బాలిక ఆచూకీ కనిపించలేదు. అనేక దఫాలుగా.. అనేక విధాలుగా అధికారులు ఆ పాప కోసం గాలింపు చేపట్టినప్పటికీ ఇంతవరకు ఆమె జాడ లభించలేదు. అనేక విధాలుగా ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ ఇంతవరకు ఉపయోగం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు కీలక ప్రకటన చేశారు.

ప్రత్యేకమైన బలగాలు.. ప్రత్యేకమైన బృందాల సహాయంతో గాలింపు చేపట్టినప్పటికీ ఇంతవరకు పాప జాడ కనిపించలేదు. సీసీ కెమెరాలు జల్లెడ పట్టారు. అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. పాప మిస్సింగ్ అయినచోట చికెన్ ముక్కలు పెట్టారు. ఆట బొమ్మలు కూడా ఏర్పాటు చేశారు. ఇన్ని రకాలుగా ఏర్పాటు చేసినప్పటికీ పాప జాడ కనిపించలేదు.

పాప మిస్సింగ్ అయి రోజులు గడుస్తున్నప్పటికీ ఇంతవరకు ఆచూకీ లభించకపోవడంతో పోలీసులు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ పాపను ఎవరైనా ఎత్తుకెళ్లి ఉంటే అప్పగించాలని.. వారి మీద ఎటువంటి కేసులు నమోదు చేసే అవకాశం లేదని పోలీసులు హామీ ఇచ్చారు. ఒకవేళ సమాచారం ఇచ్చినా సరే తాము నేరుగా వెళ్లి పాపను తీసుకొస్తామని చెప్పారు. పాపను ఆమె తల్లికి అందించడాన్నే తమలక్ష్యంగా పెట్టుకున్నామని పోలీసులు చెబుతున్నారు. అపహరణ కోణంలోనే కేసులు దర్యాప్తు చేస్తున్నామని.. మొబైల్ ఫోన్ అసలు ఉపయోగించని వ్యక్తులే ఈ దారుణానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. జ్ఞానేశ్వరి కేసులో ఓ కారు గురించి చర్చ జరిగింది. కొంతమంది వ్యక్తులు అందులో వచ్చి ఆమెను అపహరించుకుని వెళ్లారని వార్తలు వచ్చాయి. అయితే అదంతా ఫేక్ ప్రచారమని పోలీసులు కొట్టిపడేశారు.

ఇన్ని రకాలుగా దర్యాప్తు చేపట్టినప్పటికీ జ్ఞానేశ్వరి జాడ లభించకపోవడంతో.. కొంతమంది కావాలని ఆమెను అపహరించారని.. పాపను బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. పై ఆ పాపను వేరే ప్రాంతానికి తీసుకొని వెళ్లి ఉంటారని భావిస్తున్నారు. ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ పాప జాడ లభించడం లేదని పోలీసులు చెబుతున్నారు. అందువల్లే వారి మీద ఎటువంటి కేసులు నమోదు చేయకుండా.. పాపను ఆమె తల్లి దగ్గరికి చేర్చుతామని.. పాపను తీసుకెళ్లినవారు తమకు సమాచారం ఇస్తే సరిపోతుందని పోలీసులు పేర్కొంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version