
టీటీడీ పాలకమండలి సమావేశం ప్రారంభమైంది. 108 అంశాల అజెండాపై చర్చించి పాలకమండలి నిర్ణయం తీసుకోనుంది. సమావేశానికి మెజారిటీ సభ్యులు హాజరయ్యారు. వీడియో కాన్పరెన్స్ ద్వారా మరికొందరు సభ్యులు సమావేశానికి హాజరయ్యారు. కాగా ఈ సమావేశంలో శ్రీవారం ఆలయంలో దర్శనాలు పెంపు గరుడ వారధిని అలిపిరి వరకు నిర్మించేందుకు ప్రతిపాదనలు వరాహస్వామి ఆలయ గర్భాలయ వాకిలికి దాత సహాయంతో 108 కేజిల వెండితో తాపడం పనులు తదితర అంశాలపై చర్చించనున్నారు.