China: జెనీవా వాణిజ్య చర్చల్లో అవగాహనకు వచ్చిన ఏకాభిప్రాయన్ని బీజింగ్ ఉల్లంఘించిందంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలను చైనా తోసిపుచ్చింది. అవిపూర్తిగా నిరాధార ఆరోపణలు అని అభివర్ణించింది. అంతేకాదు తమ దేశ ప్రమోజనాలను కాపాడుకొనేందుకు శక్తిమంతమైన చర్యలు తీసుకొంటామని తేల్చిచెప్పింది. ఈమేరకు ట్రంప్ వ్యాఖ్యల పై వాణిజ్య శాఖ స్పందించింది. జెనీవాలో జరిగిన ఒప్పందాన్ని తాము పూర్తిస్థాయిలో అమలు చేసినట్లు చైనా పేర్కొంది. ఈ క్రమలో అమెరికా మాత్రం బీజింగ్ పై వివక్షపూరిత చర్యలు తీసుకొన్నట్లు ఆరోపించింది.