తెలంగాణలో ఉద్యోగాల భర్తీ లేకపోవడం వల్ల ఒకతరం యువత నష్టపోయిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఏడేళ్లుగా ఉద్యోగ నియామకాలు చేపట్టలేదని ఆరోపించారు. హైదరాబాద్ లో డీసీసీ అధ్యక్షులతో సమావేశమైన ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో లక్ష 90 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వివరించారు. కరోనా వల్ల పేదల జీవితాలు చితికిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా ఒక వైపు, కేసీఆర్ మరోవైపు కలిసి ప్రజలను వేధిస్తున్నారని విమర్శించారు.