
భారీ వర్షాల కారణంగా జాతీయ రహదారి 163 పైకి గోదావరి వరద నీరు వచ్చి చేరడంతో ఛత్తీస్ గఢ్, తెలంగాణ రాష్ట్రాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన ములుగు జిల్లాలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. గోదావరి వరద నీరు హైదరాబాద్ నుంచి ఛత్తీస్ గఢ్ రాష్ట్రానికి వెళ్లే జాతీయ రహదారి పైకి వాజేడు మండలంలోని పావురాల వాగు బ్రిడ్జి పైకి చేరడంతో పోలీసులు వాహనాల రాకపోకలను నిలిపివేశారు.