https://oktelugu.com/

కీలక భేటి: ఉపరాష్ట్రపతితో ఏపీ బీజేపీ నేతలు

ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ బీజేపీ నేతలు వరుసగా ఏపీ సమస్యలపై కేంద్రం పెద్దలతో లాబీయింగ్ చేస్తున్నారు. ఇప్పటికే కేంద్ర జలశక్తి మంత్రిని కలిసి రాయలసీమ ఎత్తిపోతల పథకంకు అనుమతులు ఇవ్వాలని కోరారు. తాజాగా భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారిని కలివారు. నేడు ఢిల్లీలోని ఉపరాష్ట్రపతి భవనంలో ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు మర్యాదపూర్వకంగా ఉపరాష్ట్రపతిని కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై ఉపరాష్ట్రపతి వెంకయ్య దృష్టికి ఏపీ బీజేపీ నేతలు తీసుకొచ్చారు. […]

Written By:
  • NARESH
  • , Updated On : July 23, 2021 / 03:39 PM IST
    Follow us on

    ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ బీజేపీ నేతలు వరుసగా ఏపీ సమస్యలపై కేంద్రం పెద్దలతో లాబీయింగ్ చేస్తున్నారు. ఇప్పటికే కేంద్ర జలశక్తి మంత్రిని కలిసి రాయలసీమ ఎత్తిపోతల పథకంకు అనుమతులు ఇవ్వాలని కోరారు. తాజాగా భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారిని కలివారు. నేడు ఢిల్లీలోని ఉపరాష్ట్రపతి భవనంలో ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు మర్యాదపూర్వకంగా ఉపరాష్ట్రపతిని కలిశారు.

    ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై ఉపరాష్ట్రపతి వెంకయ్య దృష్టికి ఏపీ బీజేపీ నేతలు తీసుకొచ్చారు. రాయలసీమ ఎత్తిపోతల.. ఏపీ సమస్యలు, అభివృద్ధి గురించి పలు విషయాలను చర్చించారు. సహకారం అందించాలని కోరారు.

    అనంతరం ఇటీవలే మరణించిన ఉమ్మడి రాష్ట్ర బిజెపి మాజీ అధ్యక్షులు చిలకం రామచంద్రా రెడ్డి కార్యదక్షతను ఇనుమడింపజేస్తూ ప్రచురించనున్న పుస్తక ఆవిష్కరణను ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా చేయాలని కోరారు. దీనికి వెంకయ్య సానుకూల స్పందించారు. సోము వీర్రాజు వెంట రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు విష్ణువర్ధన్ రెడ్డి , పీవీఎన్ మాధవ్ పాల్గొన్నారు.