
ఆంధ్రప్రదేశ్ లో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. కృష్టా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ను మైనారిటీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ప్రభుత్వం నియమించింది. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ నివాస్ ను కృష్ణా జిల్లా కలెక్టర్ గా, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గా ఎల్. ఎస్ బాలాజీరావు, అనంతపురం జిల్లా కలెక్టర్ గా నాగలక్ష్మి, గ్రామ, వార్డు సచివాలయాల డైరెక్టర్ గా గంధం చంద్రుడు నియమితులయ్యారు.