https://oktelugu.com/

మహేష్ – త్రివిక్రమ్ సినిమా పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్ !

సూపర్ స్టార్ మహేష్ బాబుతో త్రివిక్రమ్ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ ఈ సినిమా స్క్రిప్ట్ పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నాడు. అయితే, ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ తెలిసింది. ఈ సినిమాని రాజకీయ నేపథ్యంలో సాగే కేజిఎఫ్ రేంజ్ భారీ యాక్షన్ సినిమాగా తీయాలని త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడట. కానీ, తనకు పక్కా యాక్షన్ మూవీ వద్దు అని, మహేష్ నో అన్నారని ఈ మేరకు ఓ గ్యాసిప్ ఇండస్ట్రీలో టాక్ […]

Written By: , Updated On : May 30, 2021 / 07:17 PM IST
Follow us on

సూపర్ స్టార్ మహేష్ బాబుతో త్రివిక్రమ్ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ ఈ సినిమా స్క్రిప్ట్ పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నాడు. అయితే, ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ తెలిసింది. ఈ సినిమాని రాజకీయ నేపథ్యంలో సాగే కేజిఎఫ్ రేంజ్ భారీ యాక్షన్ సినిమాగా తీయాలని త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడట. కానీ, తనకు పక్కా యాక్షన్ మూవీ వద్దు అని, మహేష్ నో అన్నారని ఈ మేరకు ఓ గ్యాసిప్ ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.

ఇక త్రివిక్రమ్ సన్నిహితుల దగ్గర నుండి అందుతున్న సమాచారం ప్రకారం మహేష్ బాబును కొత్తగా చూపించడానికి త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడట. అలాగే నేటి రాజకీయాలను కూడా త్రివిక్రమ్ ఈ సినిమాలో చూపించబోతున్నాడని కూడా వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ చిత్రం కోసం త్రివిక్రమ్ ఢిల్లీలోని భిన్నమైన రాజకీయ నేపథ్యం ఎంచుకున్నారని, అలాగే పలనాటి ప్రాంతానికి సంబంధించిన నేపథ్యాన్ని కూడా చూపిస్తారట.

అదేవిధంగా రాజకీయాలతో పాటు ఓ సామాజిక అంశాన్ని కూడా సినిమాలో
ప్రముఖంగా ప్రస్తావించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కోసం త్రివిక్రమ్ ఓ కీలక పాత్రను కూడా రాసాడని, ఇది పక్కా రాజకీయ నాయకుడి పాత్ర అని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్నారని, అందులో ఒక హీరోయిన్ ను బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ ను తీసుకోబోతున్నారని రూమర్స్ వస్తున్నాయి.

మరో కథానాయికగా తన గత రెండు సినిమాల్లో నటించిన పూజా హెగ్డేను తీసుకోవాలని త్రివిక్రమ్ తాపత్రయ పడుతున్నాడు. అయితే, పూజా హెగ్డే ఫైనల్ అవుతుందో లేదో చూడాలి. తన హీరోయిన్స్ విషయంలో మహేష్ పక్కా లెక్కలతో ఉంటాడు. కాబట్టి, మహేష్ నిర్ణయం పై పూజా ఈ సినిమాలో ఉంటుందా లేదా అనేది తేలుతుంది. హారికా హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాని అక్టోబర్ నుండి షూటింగ్ మొదలుకానుంది.