
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కల్లోలం కొనసాగుతుానే ఉంది, ఇవాళ కొత్తగా 41,968 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 16,167 మంది చికిత్సకు కోలుకున్నారు. 84 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో మొత్తం కొవిడ్ పాజిటివ్ కేసులు 13,02,589 కి పెరిగాయి. 11,04,431 మంది కోలుకున్నారు. యాక్టివ్ కేసులు 1,89,367 కు చేరాయి. 8791 మంది మరణించారు. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 60,124 శాంపిళ్లను పరీక్షించినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.