హీరోయిన్లకు పచ్చబొట్టు వేయించుకోవడం ఆనవాయితీ అయిపోయింది. మరీ దాన్ని ఫ్యాషన్ లో ట్రెండ్ అనుకుంటారో లేక, అలా వేయించుకోవడం ఆధునికత అనుకుంటారో ఏమో తెలియదు గానీ, పచ్చబొట్టు వేయించుకొని హీరోయిన్ లేదు అంటే అతిశయోక్తి కాదు. మరీ ముఖ్యంగా స్టార్ హీరోయిన్స్ గా గుర్తింపు పొందిన వాళ్ళు అయితే, ఈ ట్రెండ్ ను ఎక్కువగా ఫాలో అవుతుంటారు.
ఆ ఫాలో అవుతోన్న లిస్ట్ లో స్టార్ హీరోయిన్ శృతిహాసన్ కూడా ముఖ్యమైన వ్యక్తిగా నిలిచింది. శృతిహాసన్ ఒంటి పై ఏకంగా 6 పచ్చబొట్లు ఉన్నాయి అంటేనే, శృతి హాసన్, పచ్చబొట్లకు ఎంత ఎక్కువ ప్రాధ్యానత ఇస్తోందో అర్ధం చేసుకోవచ్చు. అయితే శరీరంపై ఎక్కడెక్కడ పచ్చబొట్లు ఉన్నాయో కనిపెట్టడం కూడా కష్టమైపోయింది.
శృతిహాసన్ వేయించుకున్న ఆరు పచ్చబొట్లుల్లో రెండు సీక్రెట్ టాటూస్ అట. మరి సీక్రెట్ ప్లేస్ ల్లో ఎలా వేయించుకుంది అని నెటిజన్లు డౌట్లు వ్యక్తపరుస్తున్నారు. సీక్రెట్ గా ఉండే టాటూస్ తో ఎలాంటి సమస్య ఉండదు. కానీ అందరికీ కనిపించే టాటూస్ తోనే అసలు సమస్య. చూడటానికి విచిత్రంగా ఉంటే ఎదుటివ్యక్తికి ఏమిటి అది అనే ఆత్రుత,
పైగా కొన్ని పచ్చబొట్ల రూపురేఖలు మరీ దరిద్రంగా ఉంటాయి. అయినా హీరోయిన్లు మాత్రం మేకప్ ను కూడా మానేస్తారు గానీ, టాటూస్ ను వేయించుకోవడం మాత్రం చచ్చినా మానరు. అన్నట్టు శృతిహాసన్ కి టాటూస్ వేయించుకోవడం ఒక వ్యసనంగా మారిపోయిందట. ఏ కొత్త ప్లేస్ కి వెళ్లినా ముందు అక్కడ ఎలాంటి టాటూస్ వేస్తున్నారనే ఆలోచనలు ఆమెకు ముందుగా వస్తాయట. ఏమిటో శృతి హాసన్ పాపం.