
పారాలింపిక్స్ లో ఇండియాన్ అథ్లెట్ వినోద్ కుమార్ కు షాక్ తగిలింది. డిస్కస్ త్రో ఎఫ్ 52 క్లాస్ లో అతడు గెలిచిన బ్రాంచ్ మెడల్ ను కోల్పోయాడు. టోక్యో పారాలింపిక్స్ టెక్నికల్ కమిటీ అధికారులు వినోద్ ను ఎఫ్ 52 క్లాస్ డిస్కస్ కు అనర్హుడిగా తేల్చారు. దీంతో ఈ కాంపిటిషన్ లో అతడు సాధించిన ఫలితాన్ని రద్దు చేయడంతో బ్రాంజ్ మెడల్ కోల్పోయాడు. డిస్కస్ త్రోలో ఎఫ్ 52 క్లాస్ అనేది.. బలహీన కండరాల శక్తి, వాటి కదిలికల్లో అడ్డంకులు వంటి వాటిని పరిగణనలోకి తీసుకొని వర్గీకరిస్తారు.