Today horoscope in telugu : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారం ద్వాదశ రాశులపై భరణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో నాలుగు రాశుల వారికి అన్ని శుభ ఫలితాలే ఉండనున్నాయి. మరి కొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వారు ఈరోజు పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సివస్తుంది. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. వ్యాపారులకు కుటుంబ సభ్యుల మధ్యత ఉండటంతో అధిక లాభాలు పొందుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. అనుకోకుండా ధన లాభం ఉండనుంది. వ్యాపారులు కొత్త భాగస్వాములను చేర్చుకుంటారు. వీరితో అధిక లాభాలు పొందే అవకాశం ఉంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే గురువుల మద్దతు ఉంటుంది. విదేశాల్లో విద్య కోసం చేసే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వారికి ఈ రోజు సానుకూలమైన ఫలితాలు ఉండనున్నాయి. వ్యాపారులు ఏదైనా కొత్త పనిని ప్రారంభిస్తే అది విజయవంతంగా పూర్తి అవుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడులనుంచి ఇప్పుడు లాభాలు పొందుతారు. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉండడంతో అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. విద్యార్థుల కెరీర్ పై తల్లిదండ్రులు కీలక నిర్ణయం తీసుకుంటారు.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈ రోజు ఇతరులతో జాగ్రత్తగా ఉండాలి. స్నేహితులతో సరదాగా ఉంటారు. కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. ముఖ్యమైన పనులను ఈ రోజే చేయడం మంచిది. వాయిదా వేయడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. చట్టపరమైన చిక్కుల నుంచి బయటపడతారు. పూర్వీకుల ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : . ఈ రాశి వారి ఆదాయం ఈరోజు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. వ్యాపారులు ఊహించిన దానికంటే ఎక్కువగా లాభాలు పొందుతారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఇంట్లో జరిగే శుభకార్యంతో సందడిగా మారుతుంది. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఈ రోజు ధైర్యంగా ఉంటూ కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేయగలుగుతారు. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా ఉంటారు. జీవిత భాగస్వామితో షాపింగ్ చేస్తారు. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టేముందు పెద్దలను సంప్రదించడం మంచిది. నిరుద్యోగులు అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు రాజకీయ నాయకులు అయితే వీరికి ఈరోజు కలసి వచ్చే అవకాశం ఉంది. గతంలో ఆగిపోయిన పనులు ప్రారంభమవుతాయి. కొన్ని శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈ రోజు అనవసరమైన వివాదాల్లోకి తలదూర్చకుండా ఉండాలి. నాణ్యమైన ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి. పెద్దల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. వ్యాపారులు కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. సోదరులతో ఉల్లాసంగా గడుపుతారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఈ రోజు కొన్ని ప్రతికూలమైన వాతావరణాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్థికంగా గతంలో కంటే ఇప్పుడు మెరుగ్గా ఉంటుంది. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు పెద్దలను సంప్రదించాలి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. ఎవరికి డబ్బు ఇచ్చే ప్రయత్నం చేయవద్దు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈరోజు అరుదైన అవకాశాలను పొందుతారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉండడంతో కొన్ని ముఖ్యమైన పనులను వెంటనే పూర్తిచేస్తారు. వ్యాపారులకు గతంలో కంటే ఇప్పుడు లాభాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అయితే శత్రువుల జాడల పై కన్నేసి ఉంచాలి. కొందరు పక్కనే ఉండి మోసం చేసే అవకాశం ఉంది. కొత్త వ్యక్తులతో అప్పుడే ఆర్థిక వ్యవహారాలు జరపకుండా ఉండాలి. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగించుకునేందుకు ప్రయత్నించాలి.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : మీ రాశి వారు ఈ రోజు ఆగిపోయిన ధనాన్ని పొందుతారు. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. కొన్ని క్లిష్టమైన పనులను ఈరోజు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. సోదరుల మధ్య సఖ్యత పెరుగుతుంది. గతంలో కంటే ఇప్పుడు మెరుగైన లాభాలు పొందుతారు.