Today horoscope in telugu ‘: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం ద్వాదశ రాశులపై భరణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి అనుకోని అదృష్టం కలగనుంది. మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి, కృత్తిక 1) : వ్యాపారులకు ఊహించని లాభాలు ఉంటాయి. కొత్తగా ఎటువంటి పెట్టుబడి పెట్టిన అధిక లాభాలు వస్తాయి. అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు. ఉద్యోగులకు కొత్త అవకాశాలు వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగులకు గౌరవం పెరుగుతుంది. సాయంత్రం ఆకస్మికంగా అనారోగ్యానికి గురవుతారు. అందువలన నాణ్యమైన ఆహారాన్ని తీసుకోవాలి. తల్లిదండ్రులు ఆరోగ్యం పై జాగ్రత్తగా తీసుకోవాలి.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఖర్చులు పెరుగుతాయి. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. సాయంత్రం శుభ కార్యక్రమం లో పాల్గొంటారు. విహార యాత్రలకు వెళ్లాలని అనుకుంటే ఇదే మంచి అవకాశం. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటారు. ఉద్యోగులకు సీనియర్ల నుంచి నుంచి మద్దతు ఉంటుంది.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): వ్యాపారులకు ధన అవసరం ఉంటే బంధువుల నుంచి సాయం అందుతుంది. కొత్తగా ఎటువంటి పనులు మొదలుపెట్టిన పెద్దల సలహా తీసుకోవడం చాలా అవసరం. విద్యార్థులకు ఉపాధ్యాయుల నుండి పూర్తి మద్దతు ఉంటుంది. దీంతో వారు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు. కొత్త వ్యక్తులతో ఆర్థిక వ్యవహారాలు జరపొద్దు.ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఉద్యోగులకు పని ఒత్తిడి ఉంటుంది. జీవిత భాగస్వామితో వాగ్వాదం ఉంటుంది. అయితే మాటలను అదుపులో ఉంచుకోవడం ద్వారా సమస్య పరిష్కారం అవుతుంది. లేకపోతే గొడవలు పెరిగే అవకాశం. వ్యాపారులు ఏర్పాటు చేసుకునే ప్రణాళికలతో అధిక లాభాలు పొందుతారు. భవిష్యత్తులో దృష్టిలో ఉంచుకొని కొత్తగా పెట్టుబడును పెడతారు. ఎవరైనా అడ్డంకులు సృష్టిస్తే వారిని అధిగమిస్తారు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : వ్యాపారులు కొన్ని కార్యక్రమాలతో బిజీగా ఉంటారు. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది. విదేశాల్లో ఉండేవారి నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థుల కెరీర్ పై తల్లిదండ్రులు కీలక నిర్ణయం తీసుకుంటారు. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. బకాయలు వసూలు అవుతాయి. దీంతో మనసు ప్రశాంతంగా ఉంటుంది. సాయంత్రం పాత స్నేహితులను కలుస్తారు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఇంట్లో జరిగే శుభకార్యం కోసం బిజీగా ఉంటారు. గతంలో ఉన్న సమస్యల నుంచి బయటపడతారు. జీవిత భాగస్వామితో వాగ్వాదం ఉంటే నేటితో సమసి అయిపోతుంది. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. వ్యాపారులకు కుటుంబ సభ్యుల పూర్తి మద్దతు ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించడానికి తోటి వారు సహాయం చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఉద్యోగులకు అదనపు ఆదాయం సమకూరుతుంది. ప్రభుత్వ ఉద్యోగులు బాధ్యతతో వ్యవహరించాలి. విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారులకు కొందరు అడ్డంకులు సృష్టించే అవకాశం ఉంది. అందువల్ల కొత్త వ్యక్తులతో ఆర్థిక వ్యవహారాలు జరపొద్దు. ఎంతోకాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. మందుల నుంచి ధన సహాయం అందుతుంది. పాత స్నేహితులను కలవడంతో మనసు ఉల్లాసంగా ఉంటుంది.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఖర్చులు పెరుగుతాయి. ఆదాయం తగ్గుతుంది. వ్యాపారులకు శత్రువులు ఎదురవుతారు. వీరిని అధిగమించడానికి అనేక రకాల ప్రణాళికలు వేస్తారు. ఉద్యోగులకు అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. అయితే కొందరి సహాయంతో అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు. రాజకీయాల్లో ఉండే వారికి కొత్త అవకాశాలు వస్తాయి. మానసికంగా ఆందోళనగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : వ్యాపారులకు కుటుంబ సభ్యుల మధ్యతో ఉంటుంది. దీంతో వీరు పెట్టుబడులు పెడతారు. ఉద్యోగులు లక్ష్యాలను పూర్తి చేయడంతో ఉల్లాసంగా ఉంటారు. జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణాలు చేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షల పాల్గొంటే విజయం సాధిస్తారు. కొన్ని పనులు పూర్తి చేయడానికి కష్టపడాల్సి వస్తుంది. జీవిత భాగస్వామితో వ్యాపారం చేసేవారు కాస్త శ్రమించాల్సి ఉంటుంది.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : తల్లిదండ్రుల సలహాతో వ్యాపారులు అధిక లాభాలు పొందుతారు. ఉద్యోగులకు కొన్ని అడ్డంకులు ఏర్పడతాయి. అయితే బంధువుల సహాయంతో మనసు ప్రశాంతంగా మారుతుంది. ఎవరి దగ్గరనైనా అప్పు తీసుకునే అవకాశం ఉంటే వెంటనే తీసుకోవచ్చు. పెండింగ్ బకాయిలు వసూలు అవుతాయి. పూర్వీకులు ఆస్తి విషయంలో శుభవార్తలు వింటారు.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : కుంభ రాశి ఉద్యోగులకు కొత్త ఆదాయ వనరులు సమకూరుతాయి. ఎవరికైనా అప్పు ఇవ్వాల్సి వస్తే వెంటనే వేయవచ్చు. ఇవి తిరిగి వసూలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గతంలో ఉన్న సమస్యల నుంచి బయటపడతారు. కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలకు వెళ్తారు. అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : సమాజంలో గౌరవం పెరుగుతుంది. విద్యార్థులకు ఉపాధ్యాయుల పూర్తి మద్దతు ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. జీవిత భాగస్వామితో కలిసి షాపింగ్ చేస్తారు. శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. కొందరు వ్యాపారులకు వ్యతిరేకంగా ప్రవర్తించే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం మంచిది.