Today horoscope in telugu : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారం ద్వాదశ రాశులపై పూర్వాషాడ నక్షత్ర ప్రభావం ఉండనుంది. ఇదే సమయంలో వ్యాపారులకు మెరుగైన ఫలితాలు రానున్నాయి. మరి కొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి, కృత్తిక 1) : ఈ రాశి వారికి ఈ రోజు అన్ని అనుకూల ఫలితాలే ఉండనున్నాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సివస్తే తండ్రి సలహా తీసుకోవాలి. జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణాలు చేస్తారు. ఆర్థికంగా మెరుగైన లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. కొన్ని పనుల కారణంగా బిజీ వాతావరణం లో ఉంటారు. ఉద్యోగులకు ఖర్చులు పెరిగే అవకాశం. విదేశాల్లో ఉండే విద్యార్థుల నుంచి శుభవార్తలు వింటారు.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఖర్చులు పెరుగుతాయి. అయితే ఆదాయం కూడా పెరుగుతుంది. దీంతో ఎటువంటి సమస్య ఉండదు. ఉద్యోగులు లక్ష్యాలను పూర్తి చేస్తారు. ఈ కారణంగా సమాజంలో గౌరవం పొందుతారు. సాయంత్రం ఉల్లాసంగా ఉంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. పాత స్నేహితులను కలవడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. కొత్తగా ప్రాజెక్టులు చేపట్టడం వల్ల బిజీగా ఉంటారు. పెద్దల సలహాతో కొత్త పెట్టుబడులు పెడతారు. చట్టపరమైన సమస్యలు ఉంటే వెంటనే పరిష్కారం అవుతాయి. పిల్లలకు సంబంధించిన సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించుకోవాలి.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఉద్యోగులు శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. జీవిత భాగస్వామితో కలిసి షాపింగ్ చేస్తారు. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. విదేశాల్లో ఉండేవారి నుంచి శుభవార్తలు వింటారు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు కొత్తగా వ్యాపారం ప్రారంభించాల్సి వస్తే పెద్దల సలహా తీసుకోవాలి. కొత్త వ్యక్తులతో ఆర్థిక వ్యవహారాలు జరిపే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. పెండింగ్ సమస్యలను పరిష్కరించుకుంటారు. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. బంధువుల నుంచి దళ సహాయం పొందుతారు. కొన్ని సమస్యల్లో చిక్కుకుంటారు. వీటి నుంచి బయట పడేందుకు స్నేహితుల సహాయం తీసుకుంటారు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి ఉద్యోగులు సీనియర్లతో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని అవసరాల కోసం డబ్బు ఖర్చు అవుతుంది. అయితే జీవిత భాగస్వామి మద్దతుతో కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. తండ్రి ఎండతో కొన్ని పనులను పరిష్కరించుకుంటారు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఒక పని పూర్తి చేయడానికి మార్గం దొరుకుతుంది. ఉద్యోగులు బాధ్యత వ్యవహరించాలి. లేకుంటే నష్టం ఏర్పడుతుంది.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తే ఇతరుల సలహా తీసుకోవాలి. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. స్నేహిత సహాయంతో పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. అయితే కొన్ని ఇంకా పెండింగ్ ఉండడంతో నిరాశతో ఉంటారు. తల్లిదండ్రులతో కలిసి ప్రయాణాలు చేస్తారు. వాహనాలపై వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలి. గతంలో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఆర్థికంగా మెరుగైన ఫలితాలు ఉంటాయి. ఆధ్యాత్మిక వాతావరణంలో గడుపుతారు. కుటుంబ సభ్యులకు ఖర్చులు చేస్తారు. జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణాలు చేస్తారు. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. బంధువుల నుంచి దన సహాయం అందుతుంది. ఎవరికైనా డబ్బు ఇవ్వాల్సి వస్తే ఆలోచించాలి.
ధనస్సు రాశి( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : కొన్ని వివాదాలు ఎదురవుతూ ఉంటాయి. అయితే ఓపికతో ముందుకు పోవాలి. ఉద్యోగులు కార్యాలయాల్లో జాగ్రత్తగా ఉండాలి. సీనియర్లతో వివాదం ఏర్పడితే మాటలను అదుపులో ఉంచుకోవాలి. కుటుంబ సభ్యుల్లోనూ ఒకరితో వాగ్వాదం ఉంటుంది. ఇలాంటి సమయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. వ్యాపారులను ఒకరు మోసం చేయడానికి ప్రయత్నిస్తారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఖర్చుల గురించి ఆందోళన చెందుతారు. ప్రయాణాలు చేసే వారు జాగ్రత్తగా ఉండాలి. చేతిలోకి పెద్ద మొత్తంలో డబ్బు అందుతుంది. దీంతో సంతోషంగా ఉంటారు. బంధువుల్లో ఒకరి నుంచి ధన సహాయం అందుతుంది. కొత్త ప్రాజెక్టులు చేపట్టేవారు పెద్దల సలహా తీసుకోవాలి. ఆర్థిక వ్యవహారాలు జరిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : కుంభ రాశి వారు కొన్ని పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారులకు అడ్డంకులు ఏర్పడతాయి. అయినా సరే అనుకోని అదృష్టం వల్ల లాభాలు పొందుతారు. ఉద్యోగులకు సీనియర్ల మద్దతు ఉంటుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఏ పని చేసినా ఇష్టపూర్వకంగా చేయాలి. కష్టమైన పనిని వదిలేయడమే మంచిది.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : జీవిత భాగస్వామితో వ్యాపారం చేసే వారికి ఈరోజు అనుకూలం. ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తే పెద్దల సలహా తీసుకోవాలి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.