కృష్ణా జలాలపై సుప్రీంకు.. సజ్జల
కృష్ణా జలాల వివాదంపై ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్తుందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ చర్యల వల్ల నీరు వృథాగా సముద్రం పాలైందన్నారు. వర్షాలు పడకపోతే రాయలసీమ ప్రాంతానికి అపార నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటివి మరోసారి జరగరాదనే సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించినట్లు చెప్పారు. రెండు రాష్ట్రాలు కలిసి మాట్లాడుకోవాలని చెబుతున్నారు. మాట్లాడాలంటే తెలంగాణ నుంచి ఎవరైనా ముందుకు రావాలి కదా అని వ్యాఖ్యానించారు.
Written By:
, Updated On : July 13, 2021 / 08:01 PM IST