Winter Tips : చలికాలం వచ్చేసింది. ప్రస్తుతం అన్ని చోట్ల చలి తీవ్రత పెరిగిపోయింది. బయట వాతావరణంలోనే కాకుండా ఇంట్లో ఉన్నా కూడా చలి ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో అయితే ఉష్ణోగ్రతలు కూడా చాలా తక్కువ అయ్యాయి. ఏ సమయంలో బయటకు వెళ్లిన కూడా చల్లని గాలులు వీస్తాయి. చలి వల్ల చాలా మందికి జలుబు, దగ్గు వంటివి వస్తాయి. దీనికి తోడు ఇంట్లో కూడా చల్లగా ఉండే ఈ సమస్య పెరుగుతుంది. ఈ సమస్య నుంచి విముక్తి చెందడానికి చాలా మంది గదిలో హీటర్ వంటివి పెట్టుకుంటారు. వీటివల్ల గదిలో వెచ్చగా ఉంటుందని భావిస్తారు. ఈ రూమ్ హీటర్ వాడటం వల్ల గది ఉష్ణోగ్రతలు కూడా మారుతాయి. దీనివల్ల గదులు చల్లగా కాకుండా వెచ్చగా ఉంటాయి. కానీ దీనివల్ల కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తుంది. ఇలాంటివి లేకుండా తక్కువ ఖర్చుతో గదులను వెచ్చగా ఉంచుకోవచ్చు. మరి ఆ టిప్స్ ఏంటో తెలియాలంటే స్టోరీపై ఓ లుక్కేయండి.
గదులు చల్లగా కాకుండా వెచ్చగా ఉండాలంటే మొదటి చేయాల్సిన పని.. ఇంట్లోకి ఎలాంటి గాలి రాకుండా జాగ్రత్తపడాలి. కిటికీలు, తలుపులు అన్నింటికి దట్టగా ఉండే వాటిని పెట్టాలి. లేదా కిటికీలకు గ్లాస్‌లు పెట్టాలి. మీకు ఏది వీలైతే వాటిని దట్టమైన వాటితో కవర్ చేయాలి. గదిని ఇలా కవర్ చేయడం వల్ల గది అంతా వేడిగా ఉంటుంది. కొందరు ఇంట్లోకి దోమలు రాకుండా ఉండాలని కిటికీలకు మెస్‌లను ఉపయోగిస్తారు. ఈ చిన్న రంధ్రాల ద్వారా గాలి లోపలికి ప్రవేశిస్తుంది. దీంతో గది అంతా చల్లగా ఉంటుంది. కాబట్టి గాలి లోపలికి రాకుడదంటే.. వాటికి కార్ట్ బోర్డ్‌ను సెట్ చేయాలి. వీటివల్ల ఎలాంటి గ్యాప్ లేకుండా ఉంటుంది. దీంతో గది లోపలికి చల్లని గాలి రాకుండా వెచ్చగా ఉంటుంది. చలికాలంలో ఇళ్లు మొత్తం వెచ్చగా ఉంటుంది.
ముఖ్యంగా నేల అయితే చెప్పక్కర్లేదు. నేల చల్లగా ఉండకూడదంటే దట్టంగా, వెచ్చగా ఉండే మ్యాట్‌లను వాడాలి. వీటిని ఇంట్లో వేయడం వల్ల చల్లగా కాకుండా వేడిగా ఉంటుంది. అలాగే నిద్రపోయే బెడ్ మీద చల్లని బెడ్‌షీట్లు కాకుండా వెచ్చగా ఉండే వాటిని వాడాలి. వీటివల్ల మీరు పొరపాటున కుర్చున్న, నిద్రపోయిన కూడా వెచ్చగా ఉంటుంది. కాటన్‌వి చలి కాయని వాటిని వేయడం వల్ల చల్లగా అనిపిస్తుంది. అలాగే ఇంట్లోకి ఏ విధంగా కూడా చల్లని గాలి రాకుండా సెట్ చేసుకోవాలి. సాయంత్రం అయితే వెంటనే తలుపులు మూసేయాలి. ఎందుకంటే సాయంత్రం వేళలో గది చల్లగా ఉంటుంది. దీనివల్ల ఆ చల్లదనం ఇంటి మొత్తం వ్యాపిస్తుంది. కాబట్టి సాయంత్రం అయితే తలుపులు మూసేయండి. అలాగే ఇంట్లో కొవ్వొత్తి లేదా దీపాన్ని వెలిగించండి. ఇవి గదిని వెచ్చగా ఉంచడంలో బాగా సాయపడతాయి.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది.