Wife: దాంపత్య జీవితం చాలా అందమైనది. ఇద్దరు వ్యక్తులు కలిసి ప్రయాణం చేసే క్రమంలో ఎన్నో ఆటుపోట్లు.. కష్టనష్టాలు ఉంటాయి. కానీ వీటిని అధిగమించుకుంటూ సంతోషంగా గడపడమే అసలైన జీవితం. భార్యభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుంటే ఆ లైఫ్ హ్యీపీగా ఉంటుంది. కానీ కొందరు పెత్తనానికి పోయి దూరం పెంచుకుంటారు. దీంతో ఇద్దరూ నష్టపోతుంటారు. భార్యభర్తల మధ్య మాటలు, చేష్టలతో కొన్ని సార్లు దూరం కావొచ్చు. కానీ శృంగారం వీరి మధ్య బంధాన్ని మరింత పటిష్టం చేస్తుంది. వారంలో ఒకసారైనా దంపతులు సంతోషకరమైన శృంగారంలో పాల్గొనడం ద్వారా చాలా సంతోషంగా ఉంటారు. ఈ విషయంలో మగవారు ఉత్సాహంగా ఉంటారు. కానీ కొందరు మహిళలు మాత్రం శ్రద్ధ చూపరు. అయితే సాధారణ సమయాల్లో భర్త నచ్చకపోయినా.. పడకగదిలోకి వెళ్లిన తరువాత అతనితో సర్వస్వం అన్నట్లుగా ప్రవర్తించాలి. అప్పుడే భార్యపై నమ్మకం పెరుగుతుంది. ఇలా నమ్మకం పెరగడానికి భార్య పడకగదిలోకి వెళ్లే ముందు ఈ విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి. అవేంటంటే?
కుటుంబం గురించి..
ఇద్దరు వేర్వేరు కుటుంబాల నుంచి వచ్చిన వారు కలిసి ప్రయాణం చేస్తారు. కానీ కొందరు ఆడవారికి కుటుంబం అంటే ఇష్టం ఉండదు. భర్త తనతో సంతోషంగా ఉంటే చాలని అనుకుంటారు. అయితే ఈ విషయాలను సాధారణ సమయాల్లో మాత్రమే చర్చించుకోవాలి. పడకగదిలోకి వెళ్లిన తరువాత భర్తకు సంబంధించిన బంధువులు లేదా ఇతరు గురించి మాట్లాడుకోవద్దు. ఒక్కోసారి భర్తకు సంబంధించిన బంధువులను భార్య వ్యతిరేకిస్తే ఆమెపై తీవ్ర కోపం వస్తుంది. దీంతో శృంగారానికి భంగం కలుగుతుంది.
మనస్ఫూర్తిగా..
ఆడ, మగ ఇద్దరి చొరవతోనే శృంగారం సంతృప్తినిస్తుంది. ఈ విషయంలో మగవారు ఉత్సాహంగా ఉంటారు. కానీ కొందరు ఆడవాళ్లు పెద్దగా శ్రద్ధ చూపరు. ఏదో కాసేపు భరిద్దాం.. అన్నట్లుగా వ్యవహరిస్తారు. అంతేకాకుండా ప్రతీ సారి మగవారి పిలిస్తేనే శృంగారంలోకి వెళ్లాలని భావిస్తారు. కొన్ని సమయాల్లో ఆడవారు కూడా మగవారిపై ప్రేమ చూపాలి. చాలా రోజులు ఈ పరిస్థితి ఉంటే మగవారికి విరక్తి పుట్టే అవకాశం ఉంటుంది. దీంతో దూరంగా ఉండడానికి అలవాటు పడుతారు.
మగవారి గురించి..
శృంగారం భావప్రాప్తి పూర్తయిన తరువాత కొందర మహిళలు ఏ విషయం చెప్పరు. తమకు నచ్చలేదని లేదా ఇలా కాకుండా వేరే విధంగా చేయాలనే విషయాన్ని వెల్లడించరు. దీంతో తన చర్య వల్ల భార్య ఎలా ఫీలవుతుందో తెలియక భర్తకు విసుగు పుడుతుంది. ఒక్కోసారి తను వేరే విధంగా ఆలోచించి భార్యను పట్టించుకోకుండా ఉంటారు.
రబ్బరు బొమ్మలా కాకుండా..
శృంగారం చేసే సమయంలో కొందరు ఆడవాళ్లు ఇది తమ పని కాదు అన్నట్లుగా కామ్ గా ఉంటారు. భర్తకు సహకరించకుండా ఊరికే రబ్బరు బొమ్మలా పడుకుంటారు. ఈ సమయంలో మగవారికి సహకరిస్తే వారిలో మరింత ఉద్రేగం పెరిగి ఎక్కువ సేపే ఇందులో ఉండాలని అనుకుంటారు. కానీ అలా చేయకపోవడం వల్ల తనకు పెద్దగా ఫీలింగ్ అనిపించకపోయి.. మరోసారి దగ్గరికి రావడానికి ఆసక్తి చూపరు. దీంతో దంపతుల ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది.