https://oktelugu.com/

Baldness : బట్టతల ఎందుకు వస్తుంది? దీన్ని నివారించడం ఎలా?

ప్రస్తుతం అంతా జంక్ ఫుడ్ తినడం, మద్యపానం సేవించడం, పోషకాలు లేని ఫుడ్ తీసుకోవడం వల్ల ఎక్కువ శాతం మంది ఈ సమస్య బారిన పడుతున్నారు. అయితే బట్ట తల ఎందుకు వస్తుంది? పురుషులకే ఎందుకు ఎక్కువగా వస్తుంది? దీన్ని నివారించడం ఎలాగో పూర్తి వివరాల్లో తెలుసుకుందాం.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : November 26, 2024 / 05:07 AM IST

    Baldness

    Follow us on

    Baldness : జుట్టు అనేది ఉంటేనే అమ్మాయిలకి అయిన అబ్బాయిలకి అయిన కూడా అందం. లేకపోతే ఎంత అందంగా ఉన్నా కూడా కనిపించదు. అయితే ఈ రోజుల్లో చాలా మంది పురుషులు బట్ట తలతో ఇబ్బంది పడుతున్నారు. కేవలం పురుషులు అనే కాకుండా చాలా మంది మహిళలు కూడా ఈ సమస్య బారిన పడుతున్నారు. ముఖ్యంగా వయస్సులో ఉన్న అబ్బాయిలను అయితే ఈ బట్టతల మరీ ఇబ్బంది పెడుతుంది. దీనివల్ల వారు అందరితో సరిగ్గా తిరగలేరు. మారుతున్న జీవనశైలి, ఆహార అలవాట్ల వల్ల చాలా మంది అబ్బాయిలు ఈ సమస్య బారిన పడుతున్నారు. ప్రస్తుతం అంతా జంక్ ఫుడ్ తినడం, మద్యపానం సేవించడం, పోషకాలు లేని ఫుడ్ తీసుకోవడం వల్ల ఎక్కువ శాతం మంది ఈ సమస్య బారిన పడుతున్నారు. అయితే బట్ట తల ఎందుకు వస్తుంది? పురుషులకే ఎందుకు ఎక్కువగా వస్తుంది? దీన్ని నివారించడం ఎలాగో పూర్తి వివరాల్లో తెలుసుకుందాం.
    ఒక వ్యక్తికి బట్టితల రావడానికి చాలా కారణాలే ఉన్నాయి. ముఖ్యంగా తీసుకునే ఆహార పదార్థాలు, జీవనశైలి వల్ల ఎక్కువగా వస్తాయి. ఇవే కాకుండా వంశపారంపర్యంగా కూడా బట్టతల వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే కొందరికి శరీరంలో వచ్చే హార్మోన్ల మార్పులు వల్ల బట్టతల వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా పురుషుల్లో అయితే హార్మోన్‌లో వచ్చే మార్పుల వల్ల వస్తుందని నిపుణులు అంటున్నారు. పురుషుల్లో టెస్టోస్టిరాన్ హార్మోన్ ఎక్కువగా రిలీజ్ కావడం వల్ల తలపై వెంట్రుకలు ఊడిపోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే క్యాన్సర్, అధిక రక్తపోటు, డిప్రెషన్, ఆర్థరైటిస్ వంటి సమస్యలకు మందులు వాడటం వల్ల కూడా బట్టతల వస్తుందట. వీటితో పాటు థైరాయిడ్ వంటి సమస్యలతో బాధపడినప్పుడు మందులు వాడటం వల్ల వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
    బట్టతల రావడానికి ఇవే కారణాలు కాకుండా ఇంకా ఉన్నాయి. పోషకాలు లేని ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా బట్ట తల వస్తుంది. అలాగే ఎక్కువగా ఆలోచించడం, ఒత్తిడికి గురికావడం వంటి కారణాల వల్ల కూడా బట్టతల వస్తుంది. ఈ సమస్య నుంచి విముక్తి చెందాలంటే ఏ విషయం గురించి కూడా పెద్దగా ఆలోచించకూడదు. అలాగే పోషకాలు, విటమిన్లు ఉండే ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి. వీటిని తీసుకోవడం వల్ల జుట్టు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అన్నిటికి మించి మద్యపానం, ధూమపానం వంటివి అసలు సేవించకూడదు. వీటివల్ల తొందరగా బట్టతల వస్తుంది. ఎక్కువగా స్మోకింగ్ చేయడం వల్ల జుట్టుపై దాని ప్రభావం పడుతుంది. దీంతో తొందరగా జుట్టు రాలడం అనేది ప్రారంభమవుతుంది. అలాగే జుట్టుకి హెయిర్ డ్రయర్ వంటి ఎలక్ట్రానిక్ ఐటెమ్స్ వాడకూడదు. వీటిని వాడటం వల్ల జుట్టు తొందరగా దెబ్బతింటుంది. కాబట్టి జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే అమ్మాయిలు లేదా అబ్బాయిలు ఇద్దరూ జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.
    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.