
జమ్మూలో నిర్మించ తలపెట్టిన శ్రీవారి ఆలయ నిర్మాణానికి ఈనెల 13న భూమి పూజ నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓ జవహార్ రెడ్డి తెలిపారు. భూమి పూజ ఏర్పాట్లపై శుక్రవారం అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఆలయం, ముఖ మండపం, ప్రాకారం, పోటు, యాత్రికుల వసతిపై సమావేశంలో అధికారులతో చర్చించారు. రెండు దశల్లో ఆలయ నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను ఈఓ జవహార్ రెడ్డి ఆదేశించారు.