Rain Alert: తెలంగాణలో మూడు రోజులు భారీ వర్షాలు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రానున్న మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురినే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. నిన్నటి అల్పపీడనం తీవ్రంగా బలపడి వాయువ్య, పశ్చిమ, మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో కొనసాగుతోందని వెల్లడించింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కి.మీ. ఎత్తు వరకు కొనసాగుతూ ఎత్తుకి వెళ్లే కొద్దీ దక్షిణ దిశ వైపునకు వంపు తిరిగి ఉందని తెలిపింది.

Written By: Velishala Suresh, Updated On : September 12, 2021 3:33 pm
Follow us on