Nandha Tamil Movie: హీరో సూర్య నటుడిగా ఎదుగుతున్న రోజులు అవి. అదృష్టం కలిసి వచ్చి.. తక్కువ టైంలోనే స్టార్ అయ్యాడు. అయితే, సూర్యకి చినప్పటి నుంచి ఒక కోరిక ఉందట. సినిమా చరిత్రలో అత్యంత ఆశ్చర్యకరమైన ముగింపు గల ఓ చిత్రాన్ని తీయాలని ఎప్పుడు కల కనేవారట. అయితే, అత్యంత ఆశ్చర్యకరమైన ముగింపు రావాలంటే.. ముందు కథ కొత్తగా ఉండాలి.
అలాంటి కథ కోసమే సూర్య వెతుకుతున్న క్రమంలో దొరికిన కథ ‘నందా’. ఈ తమిళ సినిమాలో చిన్నప్పుడు సూర్య అతని తండ్రిని చంపేస్తాడు. అప్పటి నుంచి సూర్య వాళ్ళ అమ్మకి సూర్య అంటే ఇష్టం ఉండదు. ఈ సినిమా ఆకరి సన్నివేశంలో సూర్య వాళ్ళ అమ్మ సూర్యకి అన్నంలో విషం కలుపుతుంది. అది తెలిసి కూడా సూర్య ఆ అన్నం తింటాడు.
కొన్ని క్షణాల తర్వాత చనిపోతాడు. ఇది చూసిన సూర్య వాళ్ళ అమ్మ షాక్ తో చనిపోతుంది. ఇదంతా వినడానికే ఎలాగో వింతగా ఉంది కదూ. ఇక సినిమా చూస్తే ఎలా ఉంటుందో ఊహించండి. ఈ సినిమా దర్శకుడు ‘బాలా’ వరుసగా మూడు దుఃఖాంతకరమైన అంతం కలిగే సినిమాలు తీసి హ్యాట్రిక్ కొట్టాడు. ఇది చాలా గొప్ప విషయం,
ఎందుకంటే దుఃఖాంతకరమైన సినిమాలు జనాలు ఎక్కువగా చూడరు. కానీ దర్శకుడు బాల ఏమి చేసినా జనాన్ని ఆకట్టుకునే విధంగానే ఉంటుంది. పైగా సినిమాలో మంచి ఎమోషన్ ఉంటుంది. అందుకే, ఎంత బ్యాడ్ శాడ్ సినిమాలు అయినా చక్కని హిట్ టాక్ తో సక్సెస్ అయ్యేవి.