
నగరంలో ని పాతబస్తీ పరిధి చంద్రకాపురంలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులకు ఇద్దరు సోదరులు, సోదరిగా గుర్తించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని ప్రాథమిక అంచనాకు వచ్చారు.