
వరంగల్ పర్యటనలో భాగంగా ఎంజీఎం సందర్శన కలెక్టర్లతో వీడియో కాన్పరెన్స్ అనంతరం వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులతో సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యంత్రి మాట్లాడుతూ వరంగల్ సెంట్రల్ జైలును నగర శివార్లకు తరలించి ఓపెన్ ఎయిర్ జైలుగా మారుస్తామని అదే స్థలంలో సకల సౌకర్యాలతో అత్యాధునిక మాతా శిశు సంరక్షణ కేంద్రం నిర్మిస్తామని స్పష్టం చేశారు.