
కేంద్ర కార్పొరేట్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. కన్సల్టెంట్, యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 66 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ కావడం గమనార్హం. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. హైదరాబాద్, ముంబై, చెన్నై, కోల్‌కతా, ఢిల్లీ నగరాలలో ఈ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి.
మొత్తం 66 ఉద్యోగ ఖాళీలలో సీనియర్ కన్సల్టెంట్ ఉద్యోగ ఖాళీలు 14 ఉండగా జూనియర్ కన్సల్టెంట్ ఉద్యోగ ఖాళీలు 39, యంగ్ ప్రొఫెషనల్స్ ఉద్యోగ ఖాళీలు 13 ఉన్నాయి. ఈ ఉద్యోగాలను బట్టి వేర్వేరు విద్యార్హతలు ఉండగా ఆసక్తి, అర్హత ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. సీఏ, సీఎస్, ఐసీడబ్ల్యూఏ, పీజీ, డిగ్రీ పాసైన వాళ్లు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
ఆన్ లైన్ లో లేదా ఆఫ్ లైన్ లో ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. నోటిఫికేషన్ వెలువడిన 30 రోజుల్లో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. admn.hq@sfio.nic.in ఈమెయిల్ ద్వారా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. http://sfio.nic.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది.
నిరుద్యోగులకు ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు. తక్కువ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు ఉండటంతో పోటీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వెబ్ సైట్ ద్వారా ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు.