
ఇండియాలో వ్యాక్సిన్ల కొరత నేపథ్యంలో కొవిషీల్డ్ రెండు డోసుల మధ్య విరామన్ని 12 నుంచి 16 వారాలకు పెంచుతూ తీసుకున్న నిర్ణయం సరైనదేనని అన్నారు అమెరికాకు చెందిన వైట్ హౌజ్ చీఫ్ మెడికల్ అడ్వైజర్ డాక్టర్ ఆంటోనీ ఫౌచీ. ఇండియాలో ఉన్నట్లు గా మీరు క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే సాధ్యమైనంత త్వరగా ఎక్కువ మందికి వ్యాక్సిన్లు వేసే ప్రయత్నం చేయాలి. ఆ రకంగా చూస్తే ఇది మంచి నిర్ణయమే. ఇక మీ వ్యాక్సిన్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంటుానే ఇతర దేశాలు, కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోవాలని అని ఫౌచీ సూచించారు.