అటవీ శాఖ పరిధిలోని చెట్లను నరికినందుకు మధ్యప్రదేశ్ అటవీ శాఖ ఒక వ్యక్తికి ఏకంగా 1.21 కోట్ల రూపాయల జరిమానా విధించింది. ఎంపీలోని భమోరి అటవీ పరిధిలో ఛోటే లాల్ అనే వ్యక్తి ఈ ఏడాది జనవరిలో రెండు సాగ్వాన్ చెట్లను అక్రమంగా నరికి కలపను విక్రయించాడు. స్థానికుల ఫిర్యాదు మేరకు అటవీ అధికారులు రంగంలోకి దిగి విచారణ చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేశారు. చెట్లు నరికినట్టు రుజువు కావడంతో అతడికి రూ. 1.21 కోట్ల జరిమానా విధించారు. ఒక్కో సాగ్వన్ చెట్టు తన జీవిత కాలంలో రూ. 12 లక్షలు విలువ చేసే అక్సిజన్ అందిస్తుందట.