తనను గృహనిర్బంధం చేయడంపై టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. పార్లమెంట్ సమావేశాలకు రాకుండా అడ్డుకుంటున్నారని లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాకు ఆయన లేఖ రాశారు. కోకాపేటలో ప్రభుత్వం వేలం వేసిన భూముల సందర్శనకు కాంగ్రెస్ పార్టీ పిలుపిచ్చిన నేపథ్యంలో పోలీసులు ఈ ఉదయం రేవంత్ రెడ్డిని గృహనిర్భంధం చేశారు. మరోవైపు తాను పార్లమెంట్ సమావేశాలకు వెళుతుంటే అడ్డుకున్నారని రేవంత్ ఆరోపిస్తున్నారు.