https://oktelugu.com/

రేవంత్ రెడ్డి హౌస్ అరెస్ట్: కోకాపేట భూముల సందర్శన ఎఫెక్ట్

కోకాపేట భూముల వేలంలో అవినీతి జరిగిందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. దీనిపై భూముల సందర్శనకు వెళతామని ప్రకటించడంతో రేవంత్ రెడ్డిని ఇంటివద్ద తెల్లవారు జాము మూడు గంటల నుంచి భారీగా పోలీసులను మోహరించారు. రంగారెడ్డి జిల్లా కోకాపేటలో ప్రభుత్వం వేలం వేసిన భూముల సందర్శన, ధర్నాకు కాంగ్రెస్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే పోలీసులు రేవంత్ రెడ్డి ని గృహ నిర్బంధం చేశారు. జూబ్లీహిల్స్ లోని రేవంత్ రెడ్డి ఇంటికి తెల్లవారు జామున […]

Written By:
  • Srinivas
  • , Updated On : July 19, 2021 11:18 am
    Follow us on

    Revanth Reddy arrestedకోకాపేట భూముల వేలంలో అవినీతి జరిగిందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. దీనిపై భూముల సందర్శనకు వెళతామని ప్రకటించడంతో రేవంత్ రెడ్డిని ఇంటివద్ద తెల్లవారు జాము మూడు గంటల నుంచి భారీగా పోలీసులను మోహరించారు. రంగారెడ్డి జిల్లా కోకాపేటలో ప్రభుత్వం వేలం వేసిన భూముల సందర్శన, ధర్నాకు కాంగ్రెస్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే పోలీసులు రేవంత్ రెడ్డి ని గృహ నిర్బంధం చేశారు.

    జూబ్లీహిల్స్ లోని రేవంత్ రెడ్డి ఇంటికి తెల్లవారు జామున పోలీసులు చేరుకున్నారు. అక్కడి నుంచి ఎవరు కదలకుండా అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కోకాపేట భూముల వేలంలో అవినీతి జరిగిందని కాంగ్రెస్ ఆరోపించింది. ఆ క్రమంలోనే ధర్నాకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. పీసీసీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు జగ్గారెడ్డి, మహేశ్ కుమార్ గౌడ్,రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు నరసింహారెడ్డి తదితరులు కూడా కోకాపేట భూముల సందర్శనకు వెళ్లడానికి సమాయత్తం అయ్యారు.

    ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు భూముల సందర్శనకు వెళ్లే నేతలను ఎక్కడికక్కడ అడ్డుకునేందుకు భారీగా మోహరించారు. కోకాపేట, ఖానామెట్ భూముల విక్రయంతో ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరింది. ఇందులో అవినీతి జరిగిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆ క్రమంలోనే సందర్శనకు వెళ్లేందుకు పిలుపునివ్వడంతో పోలీసులు అరెస్టు చేశారు.

    ఇటు కోకాపేట భూముల కంటే ఖానామెట్ భూములు ఎక్కువ ధర పలికాయి. కోకాపేటలోని 49.92 ఎకరాలను ఎంఎస్ టీటీ వెబ్ సైట్ ద్వారా హెచ్ఎండీఏ వేలం నిర్వహించగా అత్యధికంగా ఎకరానికి రూ.60.2 కోట్లు ధర పలికింది. అత్యల్పంగా ఎకరానికి రూ. 31.2 కోట్లు వెచ్చించారు. యావరేజ్ గా ఎకరానికి రూ.40.05 కోట్లు పలికింది.