https://oktelugu.com/

King Cobra : కింగ్ కోబ్రా గురించి నమ్మలేని నిజాలు..ఇవి కేవలం ఒక జాతి మాత్రమే కాదు..

విషపూరిత పాము-కింగ్ కోబ్రాలో 4 జాతులు ఉన్నాయి . ఆ నాలుగు జాతుల్లో ఉత్తర కింగ్ కోబ్రా, సుండా కింగ్ కోబ్రా, పశ్చిమ కనుమల కింగ్ కోబ్రా లుజోన్ కింగ్ కోబ్రాలు ఉన్నాయి. అయితే ఈ ప్రమాదకరమైన పాముపై శాస్త్రవేత్తలు రహస్య ఆవిష్కరణలు చేస్తే విస్తుపోయే విషయాలు తెలిశాయట.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : November 21, 2024 / 04:10 AM IST

    King Cobra

    Follow us on

    King Cobra : భారతదేశంలో పాములను దేవతగా కొలుస్తుంటారు. ప్రతి సంవత్సరం రెండు సార్లు పాముల కోసం ప్రత్యేకమైన రోజులు కూడా వస్తాయి. నాగుల చవితి, పంచమి అని నాగదేవతలకు పూజలు చేస్తుంటారు. అయితే కొన్ని దేశాల్లో మాత్రం ఇలాంటి సాంప్రదాయం లేదు. ఇక పాములను విషపూరితమైన జాతులుగానే చూస్తుంటారు. వీటి మీద ఇప్పటికీ పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. రీసెంట్ గా కూడా పాముల మీద రీచర్చ్ చేశారు. మరి ఎందుకు చేశారు? ఈ పరిశోధనల్లో తేలింది ఏంటి అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

    విషపూరిత పాము-కింగ్ కోబ్రాలో 4 జాతులు ఉన్నాయి . ఆ నాలుగు జాతుల్లో ఉత్తర కింగ్ కోబ్రా, సుండా కింగ్ కోబ్రా, పశ్చిమ కనుమల కింగ్ కోబ్రా లుజోన్ కింగ్ కోబ్రాలు ఉన్నాయి. అయితే ఈ ప్రమాదకరమైన పాముపై శాస్త్రవేత్తలు రహస్య ఆవిష్కరణలు చేస్తే విస్తుపోయే విషయాలు తెలిశాయట. డాక్టర్ పి.గౌరీ శంకర్ రెండు దశాబ్దాలుగా పరిశోధనలు చేశారట. తన పరిశోధనలో కింగ్ కోబ్రా గురించి కొన్ని విషయాలు తెలిశాయట. వాటి గురించి పంచుకున్నారు. 12 సంవత్సరాల పరిశోధన తర్వాత, అగుంబేలోని కళింగ సెంటర్ ఫర్ రెయిన్‌ఫారెస్ట్ ఎకాలజీ శాస్త్రవేత్తలు కింగ్ కోబ్రా నాలుగు విభిన్న జాతులను కలిగి ఉన్నట్లు నిర్ధారించారు. గత పన్నెండేళ్లుగా సరీసృపాల శరీర నిర్మాణం, జన్యువులపై లోతైన అధ్యయనాలు చేశారు. అందులో ఈ పాములు అన్ని ఒకే జాతికి చెందినవి కాదని వెల్లడైందట.

    కింగ్ కోబ్రా నాలుగు జాతులు: నార్తర్న్ కింగ్ కోబ్రా (ఓఫియోఫేగస్ హన్నా), సుండా కింగ్ కోబ్రా (ఓఫియోఫేగస్ బంగారస్), పశ్చిమ కనుమల కింగ్ కోబ్రా (ఓఫియోఫాగస్ కాళింగ), లుజోన్ కింగ్ కోబ్రా (ఓఫియోఫాగస్ సాల్వతానా). నైరుతి భారతదేశంలో కనిపించే పాము ఓఫియోఫాగస్ కళింగ. ఇతర జాతులతో పోలిస్తే దాని శరీరంపై తక్కువ బ్యాండ్‌లను కలిగి ఉంటుందని తెలిపారు ఆయన.

    రెండవ జాతి, ఓఫియోఫాగస్ హన్నా. ఇది ఉత్తర భారతదేశం, తూర్పు పాకిస్తాన్, భారతదేశం-చైనా, థాయ్‌లాండ్‌లో నివసిస్తుందట. దాని శరీరంపై 5-70 బ్యాండ్‌లు ఉన్నాయి. మూడవ జాతి ఒఫియోఫాగస్ బంగారస్. దాని శరీరంపై 70 కంటే ఎక్కువ బ్యాండ్‌లు ఉన్నాయని తేలింది.

    నాల్గవ జాతి Ophiophagus salvatana దాని శరీరంపై ఎటువంటి పట్టీలు లేవు. ఇది దక్షిణ ఫిలిప్పీన్స్‌లో నివసిస్తుంది. డిఆర్ పి గౌరీ ష్ణాకర్ మాట్లాడుతూ కింగ్ కోబ్రాలో ఒకటి కంటే ఎక్కువ జాతులు ఉన్నాయని ఎవరూ ఊహించలేదట. పరిశోధనా బృందం పాము కణజాల వివిధ నమూనాలను సేకరించి, సరీసృపాల శరీరాల రంగు, పొలుసులు, బ్యాండ్‌లపై పూర్తిగా అధ్యయనం చేసిందని తెలిపారు ఆయన.

    శాస్త్రవేత్తలు హిమాలయాలు, దాని పరిసర ప్రాంతాలతో సహా భారతదేశంలోని ఉత్తర ప్రాంతాలతో పాటు ఇండోOphiophagus salvatanaనేషియా, దక్షిణ ఫిలిప్పీన్స్‌లో తమ పరిశోధనలను నిర్వహించారు. మొత్తం మీద కింగ్ కోబ్రా నాలుగు విభిన్న జాతుల కలయిక అని ధృవీకరించారు. 188 సంవత్సరాల క్రితం, 1836లో, డానిష్ జంతుశాస్త్రజ్ఞుడు థియోడర్ ఎడ్వర్డ్ కాంటర్ కింగ్ కోబ్రాకు దాని వర్గీకరణ గుర్తింపును ఇచ్చారని కూడా తెలిపారు.