
కోవిడ్ బారిన పడిన తల్లిదండ్రుల కారణంగా నిరాశ్రయులుగా ఉన్న పిల్లలకు తోడ్పాటు అందిస్తున్నట్లు సీపీ సజ్జనార్ పేర్కొన్నారు. సోమవారం సీపీ సజ్జనార్ మీడియాతో మాట్లాడుతూ తల్లిదండ్రులు ఇద్దరు కోవిడ్ బారిన పడితే వారి పిల్లలకు ఆశ్రయం కల్పిస్తున్నట్లు తెలిపారు. పిల్లల సంరక్షణ కొరకు డే కేర్ సెంటర్లను చైల్డ్ కేర్ సెంటర్ గా మారుస్తూ చిన్నారులకు చేయూతనిస్తున్నట్లు చెప్పారు. తల్లిదండ్రులకు కోవిడ్ నెగిటివ్ వచ్చే వరకు చైల్డ్ కేర్ లో పిల్లలు ఉంచవచ్చన్నారు.