
కొవిడ్ సంక్షోభం వేళ భారత్ కు ఆపన్నహస్తం అందించింది ప్రపంచ బ్యాంకు. కరోనాతో కుదేలైన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు పునరుజ్జీవం కల్పించే దిశగా భారత ప్రభుత్వం చేపట్టే చర్యలను సహకారం అందించేలా 500 మిలియన్ డాలర్ల కార్యక్రమానికి ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బోర్డు ఆమోదం తెలిపింది. 5,55,000 ఎంఎస్ఎంఈలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ప్రపంచబ్యాంకు ఓ ప్రకటనలో తెలిపింది.