
హంసానందిని.. ఎంత అందమున్నా.. ఆ అందాన్ని వినియోగించుకోలేని సినిమా ఇండస్ట్రీలున్నాయి. అందుకే ఈ అందమైన హీరోయిన్ బీచ్ ల వెంట పడుతోంది. అక్కడ సేదతీరుతూ అందాలు ఆరబోస్తోంది.
హీరోయిన్ రేంజ్ గ్లామర్ ఉన్నా.. హీరోయిన్ ఛాన్స్ లు రాక ఐటమ్ సాంగ్స్ చేసుకుంటూ హాట్ బ్యూటీస్ గా హీరోయిన్ హంసా నందిని మిగిలిపోయింది. అయితే బాగా డబ్బులొచ్చే సందర్భంలో స్వయంగా హీరోయిన్సే ఐటెమ్ సాంగ్స్ చేస్తునప్పటికీ.. ఇండస్ట్రీలో ఐటమ్ సాంగ్ అనగానే వినిపించే పేర్లల్లో ‘హంసా నందిని’ పేరు కూడా ఒకటి.
దర్శకుడు వంశీ ‘అనుమానాస్పదం’ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ హాట్ భామ ఆ తరువాత హీరోయిన్ గా అవకాశాలను మాత్రం సంపాదించలేకపోయింది. ఇక ఇండస్ట్రీలో తనను తాను నిలబెట్టుకోవడానికి సైడ్ క్యారెక్టర్స్, వ్యాంప్ పాత్రలు చేసుకుంటూ.. చివరకు అలాంటి పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది.
‘మిర్చి’ సినిమాలో చేసిన పాట సూపర్ హిట్ అవ్వడం, దాంతో హంసా నందిని కెరీర్ మళ్ళీ ట్రాక్ పైకి ఎక్కడం.. అప్పటినుండి ఇప్పటివరకూ ఛాన్స్ లకు ఇబ్బంది పడకుండా ఎలాగోలా కెరీర్ ను నెట్టుకొచ్చింది. పైగా అప్పట్లో హంసా నందిని స్పెషల్ సాంగ్ చేస్తే సినిమా బ్లాక్ బస్టర్ హిట్టే అనే సెంటిమెంట్ కూడా వచ్చిందని.. హంసనే తన ఇంటర్వ్యూల్లో చెబుతుంటుంది.
తాజాగా హంసా నందినీ ఓ ఫోటోను షేర్ చేసింది. బికినీ వేసుకొని బీచ్ ఒడ్డున అందాలు ఆరబోసింది. ఆ ఫొటోలో మత్తెక్కించేలా ఉన్న హంస అందాలు చూస్తే ఈ రాత్రి నిద్రపట్టకుండా ఉన్నాయి. ఇక ఆ బికినీ ఫొటోలను షేర్ చేస్తూ హంస ఇలా రాసుకొచ్చింది. ‘నేను బీచ్ దగ్గర నివాసించాలనుకుంటున్నా.. సాగరతీరాన రాత్రి సమయంలో సరదాగా నడవాలని.. అలల శబ్ధం వినాలనుందని పేర్కొంది’. బీచ్ దగ్గర దిగిన ఫొటోలను పంచుకుంది. అవిప్పుడు వైరల్ గా మారాయి.