
కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రిమాల్ నిషాంక్ ఈ నెల 17న అన్ని రాష్ట్రాల విద్యశాఖ కార్యదర్శులతో సమావేశంకానున్నారు. ఈ సందర్భంగా విద్యారంగంపై కొవిడ్ మహమ్మారి ప్రభావంపై సమీక్షించనున్నారు. వర్చువల్ విధానంలోనే జరిగే సమావేశంలో ఆన్ లైన్ ఎడ్యూకేషన్ ను ప్రోత్సహించడం, నూతన విద్యా విధానం అమలుపై సమీక్ష జరుపనున్నారు. కరోనా సెకండ్ వే్ తర్వాత విద్యాశాఖ కార్యదర్శులతో కేంద్ర విద్యాశాఖ మంత్రి సమావేశం నిర్వహించడం ఇదే తొలిసారని సంబంధిత శాఖ వర్గాలు పేర్కొన్నాయి.