
గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న పసిడి ధర నేడు మళ్లీ పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో నేడు స్వచ్ఛమైన బంగారం ధర పది గ్రాములకు రూ. 250 పెరిగి రూ. 46,277 కు చేరుకుంది. రూపాయి విలువ తగ్గడం, అంతర్జాతీయంగా విలువైన లోహాల ధర పుంజుకోవడంతోనే బంగారం ధరలు పెరిగినట్లు హెచ్ డీ ఎఫ్ సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ తపన్ పటేల్ తెలిపారు. పుత్తడితోపాటే పయనించే వెండి ధర కూడా నేడు స్వల్పంగా పెరిగింది. కిలోకు రూ. 258 పెరిగి రూ. 66,842కు చేరుకుంది.