
టీమ్ ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ నాలుగో రోజు ఆట పూర్తిగా నిలిచిపోయింది. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో రెండు సెషన్లు పాటు ఎదురు చూసినా వాతావరణంలో ఎలాంటి మార్పూ కనిపించలేదు. ఈ క్రమంలోనే కొద్ది సేపటి క్రితం మరోసారి మైదాన పరిస్థితులను గమనించిన అంఫైర్లు నాలుగో రోజు స్టంప్స్ ప్రకటించారు. దాంతో తొలి రోజు లాగే నేడూ ఆట ఒక్క బంతి పడకుండానే రద్దు అయింది.