
పార్లమెంటులో తొలిసారి పాత సంప్రదాయానికి విపక్షాలు తూట్లు పొడిచాయని రాజ్యసభ నాయకుడు పియూష్ గోయల్ ఆరోపించారు. కొత్త కేబినెట్ ఏర్పడినప్పుడు లేదా పునర్నిర్మాణం జరిగినపప్పుడు మంత్రులను పార్లమెంట్ సభ్యులకు ప్రధాని పరిచయం చేయడం మంచి సంప్రదాయమని అన్నారు. అయితే ప్రతిపక్ష ఎంపీలు ఈ రోజు దీనికి అంతరాయం కలిగించారని ఆయన విమర్శించారు. మొదటిసారిగా ఇంత పెద్ద సంఖ్యలో మహిళలు, గిరిజనులు, ఈశాన్య ప్రజలు కేంద్ర మంత్రివర్గంలో భాగమయ్యారని గోయల్ తెలిపారు.