
పార్లమెంట్ సమావేశాలు విపక్షాల ఆందోళనలతో ప్రారంభమయ్యాయి. ప్రధాని మోదీ నూతనంగా బాధ్యతలు చేపట్టిన కేంద్ర మంత్రులను సభకు పరిచయం చేశారు. ఈ సమయంలో విపక్ష సభ్యులు తమ నినాదాల్ని, నిరసనను వ్యక్తం చేస్తూనే ఉన్నారు. దీంతో మోదీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మహిళలు, దళితులు, గిరిజనులను ఎక్కువ సంఖ్యలో కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకున్నాం. వారందర్నీ చూస్తూ కొందరికి జీర్ణం కావడం లేదు. అందుకే వారిని పరిచయం చేస్తానంటే అడ్డుతగులుతున్నారని వ్యాఖ్యానించారు.