
టోక్యో ఒలింపిక్స్ లో భారత్, బెల్జియం మధ్య ఇవాళ జరిగిన హాకీ సెమీఫైనల్ మ్యాచ్ ను ప్రధాని నరేంద్ర మోదీ వీక్షించారు. భారత జట్టు పట్ల, ఆటగాళ్ల నైపుణ్యం పట్ల గర్వంగా ఉందని ఆయన తెలిపారు. మ్యాచ్ ముగిసిన తర్వాత మోదీ ట్వీట్ చేస్తూ గెలుపు ఓటములు జీవితంలో భాగం అన్నారు. ఇవాళ జరిగిన సెమీస్ లో ఇండియా ఓడిన సంగతి తెలిసిందే. టోక్యో లో మెన్స్ హాకీ జట్టు అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చిందని, అదే చాలా కీలకమైందని అన్నారు. తర్వాత మ్యాచ్ లో ఉత్తమంగా రాణించాలని ఆశిస్తున్నట్లు మోదీ తెలిపారు.