
పెళ్లి అంటే నూరేళ్ల పంట.. ఆపంటను పండించుకునేందుకు లక్షలు, కోట్లు ఖర్చు చేస్తున్నవారు ఉన్నారు. ఈ మధ్యన టాలీవుడ్ సెలెబ్రెటీలు రాజస్థాన్ లోని రాజప్రసాదాల్లాంటి భారీ పురాతన హోటల్స్ లో తమ వివాహాలను చేయిస్తున్నారు. అందరూ గ్రాండ్ గా వెళుతుంటే శ్రీదేవి కూతురు మాత్రం దేవుడి సన్నిధికే ఓటు వేసింది.
పెళ్లి అనేది ప్రతి మనిషిలో ఓ కీలక ఘట్టం.. సాధారణ వ్యక్తుల నుంచి సామాన్యుల వరకూ అంగరంగ వైభవంగా చేసుకోవాలని తపన పడుతుంటారు. సినిమా తారల పెళ్లిళ్లు అయితే ఓ రేంజ్ లో ఉంటుంది.
అయితే శ్రీదేవి ముద్దుల కూతురు, ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ జాన్వీకపూర్ మాత్రం తన పెళ్లి తిరుపతిలో చేసుకుంటానని.. మా కులదైవం సన్నిధిలో సింపుల్ గా కానిచ్చేస్తానని అంటోంది.
నటిగా ఇప్పడిప్పుడు ఎదుగుతున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి మనసులో మాట బయటపెట్టింది. తన కలల పెళ్లి గురించి చెప్పుకొచ్చింది.
కాప్రి ఐల్యాండ్ లో ఓ ప్రైవేట్ బోటులో నా గ్యాంగ్ తో కలిసి బ్యాచిలర్ పార్టీ చేసుకున్నాక తిరుపతిలో నా పెళ్లి చేసుకుంటాను.. మెహందీ, సంగీత్ కార్యక్రమాలు చెన్నైలోని మైలాపూర్ లో ఉన్న అమ్మ నివసించిన ఇంటిలో జరగాలి.. పెళ్లికి దక్షిణాది సంప్రదాయ చీర ధరిస్తానని జాన్వీకపూర్ తన పెళ్లి ప్రయత్నాలపై కీలక వ్యాఖ్యలు చేసింది.
ఇక తనకు కాబోయేవాడు తెలివితేటలు ఉన్న వాడైతే చాలని జాన్వీకపూర్ చెప్పింది. ప్రస్తుతం జాన్వీకపూర్ హిందీలో ‘గుడ్ లక్ జెర్రీ’ అనే సినిమాలో నటిస్తోంది.