నిరర్ధక వ్యాజ్యం వేసి కోర్టు సమయాన్ని వృధా చేసిన పిటిషనర్ కు హైకోర్టు రూ. 10 వేలు జరిమానా విధించింది. జరిమానా మొత్తాన్ని రుణం ఇచ్చిన సికింద్రాబాద్ మర్కంటైల్ కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ కు కోర్టు ఖర్చుల కింద జమ చేయాలని ఆదేశించింది. ఇరు పక్షాలు డివిజన్ లో కో- ఆపరేటివ్ అధికారి నేతృత్వంలోని కో- ఆపరేటివ్ ట్రైబ్యునల్ లో హాజరుకావాలని, మే 6 నుంచి గత ఆరు నెలల్లో జారీ చేసిన ఉత్తర్వులన్నింటినీ ట్రైబ్యునల్ తిరిగి సమీక్షించి తగిన ఆదేశాలు జారీ చేయాలంది.