
ప్రముఖ దర్శకుడు శంకర్ చిన్న కుమార్తె ఆదితీ శంకర్ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుంది. కార్తీ హీరోగా ముత్తయ్య దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం విరుమన్ లో అదితీ శంకర్ హీరోయిన్ గా నటించనుంది. 2డీ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై హీరో సూర్య, జ్యోతిక చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2022లో ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఫుల్ ప్రిపరేషన్ లో వస్తున్న అదితీని ఆదరిస్తారని ఆశిస్తున్నానని డైరెక్టర్ శంకర్ అన్నారు.