America: Isn’t America the ‘World Biggest’ now? Is prestige declining?: మొన్నటివరకు ప్రపంచానికి పెద్దన్న అమెరికా. ప్రపంచంలోనే అత్యంత సంపద, శక్తి సామర్థ్యాలు, రక్షణ వ్యవస్థలున్న ఈ దేశం ఏ దేశంపైన అయినా దాడి చేయగల సత్తా ఉండేది. కానీ అమెరికాలోనూ మార్పులు వచ్చాయి. డొనాల్డ్ ట్రంప్ ‘అమెరికన్స్ ఫస్ట్’ అని ప్రపంచాన్ని వదిలేశాడు. ఆయన దిగిపోయి గద్దెనెక్కిన జోబైడెన్ సైతం ప్రపంచదేశాల్లోని లొల్లి తమకెందుకు అని తమ సైన్యాన్ని ఉన్న ఫళంగా వెనక్కి రప్పిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇక ప్రపంచదేశాలన్ని ‘పెద్దన్న’ పాత్రను అమెరికాకు ఇవ్వడానికి ఒప్పుకోవడం లేదు. అమెరికా ప్రతిష్ట వారి అధ్యక్షుల చర్యలతో దిగజారిపోయిందని తెలుస్తోంది. ప్రపంచాన్ని లీడ్ చేసే అవకాశం ఇక అమెరికాకు లేదని.. ఆ దేశాన్ని అందరూ లైట్ తీసుకుంటున్న పరిస్థితి నెలకొంది.
అప్ఘనిస్తాన్ ను తాలిబన్లు ఆక్రమించుకోవడానికి అమెరికానే కారణమని ప్రపంచ దేశాలు ఆరోపిస్తున్నాయి. అమెరికా తాలిబన్లకు భయపడి తమ సేనలను వెనక్కి పంపించడంతో మొన్నటి వరకు అమెరికా అధ్యక్షుడు బైడెన్ పై ఉన్న కొంత వ్యతిరేకత రాను రాను మరింత పెరుగుతోంది. ట్రంప్ పాలనలో విసిగిపోయిన దేశ ప్రజలతో పాటు విదేశీప్రతినిధులు, బైడెన్ గెలుపుతో తమకు అమెరికాతో పాత స్వర్ణయుగం ప్రారంభమైందని భావించారు. కానీ ఇప్పుడు బైడెన్ తీసుకుంటున్న నిర్ణయాలతో తమ అంచనాలు తప్పాయని స్వీడన్ మాజీ ప్రధాని కార్ల్ బిల్డ్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది.
అప్ఘనిస్తాన్ లో తాలిబన్లకు అవకాశమిచ్చిన అమెరికాపై జర్మనీ లాంటి దేశాలు విసుగు చెందుతున్నాయి. ఇప్పటి వరకు ప్రపంచ దేశాలకు పెద్దన్న పాత్రగా వ్యవహరించడంతో అమెరికాకు ఆ దేశాలు అండగా నిలిచాయి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నట్లు తెలుస్తోంది. చాలా మంది దేశాల ప్రతినిధులు బైడెన్ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతూ వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నాయి.
2017లో జరిగిన నాటో సమావేశంలో ప్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యేయేల్ మేక్రాన్ అప్పటి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తో కలిసినప్పుడు ఆయన ముఖ భావాల్లో పెద్దగా ఆందోళన కనిపించలేదు. కానీ ఇటీవల జరిగిన జి-7 సమావేశంలో అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ చేతిని పట్టుకున్న మెక్రాన్ మోహంలో మాత్రం చాలా తేడాగా కనిపించింది. అప్పటికి ఇప్పటికీ ఆయన హవభావాల్లో గౌరవంలో చాలా తేడాలు కనిపించాయి. అయితే ఇది కేవలం అప్ఘాన్ నుంచి అమెరికా వైదొలగడం వల్ల కాదు. అమెరికా మిత్ర దేశాలతో సరైన రీతిలో నడుచుకోవడం లేదని అభిప్రాయం కలుగుతోందని యూరప్ లోని విశ్లేషకులు , మీడియా అభిప్రాయపడుతోంది.
యూరోపియన్ యూనియన్ కు చెందిన మరో దేశం జర్మనీ సైతం అమెరికా వ్యవహారంపై అసంతృప్తితో ఉంది. రెండో ప్రపంచ యుద్ధం తరువాత అప్ఘానిస్తాన్లో యుద్ధం కోసం జర్మనీ బలగాలు వెళ్లాయి. ఇప్పటి వరకు తిరుగులేకుండా అక్కడ వీళ్లు ఉండేవారు. కానీ అమెరికా నిర్ణయంతో మోహం చాటేసుకొని రావాల్సి వచ్చింది. ‘నాటో స్థాపించినప్పటి నుంచి చూస్తే అప్ఘనిస్తాన్ నుంచి వైదొలగడం నాటోకు కలిగిన అతిపెద్ద ఓటమి’ అని జర్మనీ చాన్స్ లర్ కు పోటీ చేస్తున్న ఆర్మిన్ లాస్చెట్ అన్నారు. ‘ప్రపంచానికి నాయకత్వం వహించే దేశంగా అమెరికా తన ప్రతిష్టను కోల్పోయింది’ అని చెక్ రిపబ్లిక్ అధ్యక్షుడు మిలోస్ జెమాన్ సైతం సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రపంచ వ్యవహారాల్లో సరైన రీతిలో వ్యవహరించే విషయంలో గత సంవత్సరం ప్యూ రీసెర్చ్ సెంటర్ నిర్వహించిన సర్వేలో ట్రంప్ పై 10 శాతం నమ్మకం ఉంటే బైడెన్ పట్ల 79 శాతం ఉన్నట్లు తేలింది. కానీ రాను రాను అమెరికా తీసుకుంటున్న నిర్ణయాలతో చాలా యూరోప్ దేశాలు ఈ సర్వేను తిరస్కరిస్తున్నట్లు తెలుస్తోంది. ‘ఈ సర్వేను తాము తిరస్కరించాలనే భావనతో ఉన్నాము’ అని యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ మాజీ సభ్యురాలు నటాజీ లోజు అన్నారు. ట్రంప్ పదవి నుంచి వైదొలిగితే తమకు పాతరోజులు వస్తాయని భావించామని, కానీ ఇక పాత రోజులు రావనే భావన కలుగుతుందని అన్నారు. జర్మనీ, బ్రిటన్ లాంటి దేశాలు భద్రత విషయంలో అమెరికా మీద ఆధారపడాల్సి వస్తుంని భావించాయి. కానీ కాలం మారిందని ఆ దేశాలు భయపడుతున్నాయి. నాటో పని తీరు గురించి మనం తిరిగి ఆలోచించాలని చాలా సార్లు చెప్పామని ఫ్రెంచ్ మాజీ మంత్రి లోజు అన్నారు.
ఒకవైపు ఇతర ట్రాన్స్ అట్లాంటిక్ అంశాల వంటివి బలపడుతుండగా అప్ఘనిస్తాన్ అంశంతో గందరగోళం తలెత్తింది. దీంతో బైడెన్ పై ఉన్న స్నేహభావం క్షీణిస్తోంది. ట్రంప్ పాలనలో యూరోపియన్ ఉత్పత్తులపై విధించిన వాణిజ్య సుంకాలను పూర్తిగా తొలగించకపోవడం, కొవిడ్ వ్యాక్సిన్ల పెంటేంట్లను తొలగించాలని యూరోపియన్ దేశాలను సంప్రదించకుండానే నిర్ణయాలు తీసుకోవడంతో సవాళ్లు ఎదురయ్యాయి. ప్రయాణ నిబంధనల విషయంలో పరస్పర అంగీకారం ఉన్నట్లు కనిపించడం లేదని యూరోపియన్ కమిషన్ వైస్ ప్రెసిడెంట్ మార్గరైటిస్ చీనాస్ అన్నారు. మొత్తంగా చూస్తే అమెరికాకు దగ్గరైన యూరోపియన్ యూనియన్ నమ్మకాన్ని కూడా అగ్రరాజ్యం కోల్పోయింది. ఇప్పుడు ప్రపంచ పెద్దన్నగా ఉండే అర్హత దానికి ఉందా? లేదా? అన్నది అనుమానాలు నెలకొంటున్నాయి.
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: America isnt america the world biggest now is prestige declining
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com