గోదావరి నదికి వరద పోటెత్తుతోంది. భద్రాచలం వద్ద గోదావరిలో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం 36.4 అడుగుల నీటిమట్టం ఉందని, ఇంకా పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా పార్వతీ బ్యారేజీ నుంచి 7.03 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. అటు నిజామాబాద్ జిల్లాలో మంజీరా నది ఉదృతితో నిజామాబాద్-మహారాష్ట్ర మధ్య భారీ వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.