
టీమ్ ఇండియా తొలి సెషన్ పూర్తి చేసుకుంది. 276/3 ఓవర్ నైట్ స్కోర్ తో శుక్రవారం ఆట కొనసాగించిన భారత్ మరో నాలుగు వికెట్లు కోల్పోయి 346/7 స్కోర్ తో నిలిచింది. ఈ క్రమంలోనే జడేజా (31), ఇషాంత్ శర్మ (0) నాటౌట్ గా నిలిచి తొలి సెషన్ ను ముగించారు. అంతకుముందు రిషబ్ పంత్ (37) పరుగులు సాధించి జడేజాతో కలిసి ఆరో వికెట్ కు 49 పరుగులు జోడించారు. మహ్మద్ షమి (0) డకౌట్ కాగా, ఓవర్ నైట్ బ్యాట్స్ మెన్ కేఎల్ రాహుల్ (129), అజింక్య రహానె (1) ఆదిలోనే ఔటై నిరాశపరిచారు.