
టీమ్ ఇండియాతో ఐదు టెస్టుల సిరీసుకు ఇంగ్లాండ్ సిద్ధమైంది. తొలి రెండు టెస్టులకు 17 మందితో కూడిన జట్టును ప్రకటించింది. దిగ్గజ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్, ఒలీ రాబిన్సన్, ఐదేళ్ల తర్వాత ఓపెనర్ హసీబ్ హమీద్ జట్టులోకి వచ్చారు. నాటింగ్ హామ్ వేదికగా ఆగస్టు 4న తొలి టెస్టు ఆరంభమవుతుంది. 12-16 వరకు లార్డ్స్ లో రెండో టెస్టు జరుగుతుంది.
ఇంగ్లాండ్ జట్టు.. జో రూట్ ( కెప్టెన్), జేమ్స్ అండర్సన్, బెన్ స్టోక్స్, జానీ బెయిర్ స్టో, డామ్ బెస్, స్టువర్ట్ బ్రాడ్, రోరీ బర్న్స్, జోస్ బట్లర్, జాక్ క్రాలీ, సామ్ కరన్, హసీమ్ హమీద్, డాన్ లారెన్స్, జాక్ లీచ్, ఒలీ పోప్, ఒలీ రాబిన్సన్, డామ్ సిబ్లీ, మార్క్ వుడ్.